ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Poonam kaur: నేను జారి పడబోతే రాహుల్ నా చేయి పట్టుకున్నారు

ABN, First Publish Date - 2022-10-30T19:47:44+05:30

హైదరాబాద్: భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) లో తాను జారి పడబోతే రాహుల్ గాంధీ Rahul Gandhi తన చేయి పట్టుకున్నారని నటి పూనం కౌర్ (Poonam kaur) చెప్పారు.

Poonam kaur
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) లో తాను జారి పడబోతే రాహుల్ గాంధీ Rahul Gandhi తన చేయి పట్టుకున్నారని నటి పూనం కౌర్ (Poonam kaur) చెప్పారు. రాహుల్ తన చేయి పట్టుకోవడాన్ని ఎందుకు వివాదం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ పక్క నారీశక్తి అని మాట్లాడుతుంటే బీజేపీ నేతలు ఇలా చేయడం తగదని, ఇది అవమానకరమని పూనమ్ కౌర్ చెప్పారు. వాస్తవానికి పూనమ్ కౌర్ చేనేత కార్మికుల అంశం మాట్లాడటానికి మహబూబ్ నగర్‌లో రాహుల్ గాంధీని కలిశారు. తాము అధికారంలోకి వస్తే చేనేతపై జీఎస్టీ లేకుండా చేస్తామని ఆమెకు హామీ ఇచ్చారు. దీన్ని పూనమ్ కౌర్ తన సోషల్ మీడియాలో ప్రముఖంగా ప్రస్తావించారు. మహిళలపై రాహుల్ గాంధీకున్న గౌరవభావాలు తన హృదయాన్ని స్పృశించాయని ట్వీట్ చేశారు. అంతేకాదు చేనేత కార్మికుల తరపున రాహుల్ గాంధీకి ధన్యవాదాలు కూడా తెలిపారు.

రగడ ఇలా మొదలు

రాహుల్ గాంధీ పూనమ్ చేయి పట్టుకున్న ఫొటోను బీజేపీ నాయకురాలు ప్రీతి గాంధీ ట్వీట్ చేశారు. తాత అడుగుజాడల్లో రాహుల్ నడుస్తున్నాడని ప్రీతి గాంధీ కామెంట్ పెట్టారు. అంతే దీనిపై రచ్చ మొదలైంది. సోషల్ మీడియాలో రాహుల్, పూనం కౌర్ ఫొటోపై ఫైట్ తీవ్రమైంది. ప్రీతి గాంధీ ట్వీట్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు స్పందించారు. నరేంద్ర మోదీ మహిళలతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వెళ్తున్నారు. ప్రీతి గాంధీ క్షమాపణలు చెప్పి తన ట్వీట్‌ను డిలీట్ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు సూచిస్తున్నారు. వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) తెలంగాణలో కొనసాగుతోంది. భారత్ జోడో పాదయాత్రలో మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy), ఉత్తమ్ కుమార్ రెడ్డి,జానా రెడ్డి,అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న ప్రారంభమై వివిధ రాష్ట్రాలలో సాగుతోంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ 12 రాష్ట్రాలను కలుపుతూ 150 రోజుల్లో 3,570 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది.

Updated Date - 2022-10-30T20:05:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising