Bharat Rashtra Samithi: కార్యాలయ ప్రారంభోత్సవానికి కేటీఆర్ డుమ్మాకు కారణం ఇదేనా?

ABN, First Publish Date - 2022-12-14T19:59:45+05:30

దేశ రాజధాని ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) పార్టీ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) గైర్హాజరయ్యారు.

Bharat Rashtra Samithi: కార్యాలయ ప్రారంభోత్సవానికి కేటీఆర్ డుమ్మాకు కారణం ఇదేనా?
Kalvakuntla Taraka Rama Rao
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) పార్టీ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) గైర్హాజరయ్యారు. ఆయన గైర్హాజరుపై బీఆర్ఎస్ (BRS) పార్టీ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ప్రత్యేక అనుమతితోటే కేటీఆర్ భారత్ రాష్ట్ర సమితి కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోయారని ప్రకటన సారాంశం. ముందే నిర్ణయించబడిన రెండు కీలకమైన పెట్టుబడి సమావేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో తెలిపారు.

మారుతి సుజుకికి చెందిన అంతర్జాతీయ విభాగాల అధిపతులతో సమావేశం ముందే నిర్ణయం కావడంతో పాటు మంత్రి కేటీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యేందుకు ఆ కంపెనీ ప్రతినిధి బృందం హైదరాబాద్ చేరుకుంది. సమయపాలన, షెడ్యూలింగ్ వంటి విషయాలకు జపాన్ కంపెనీలు అత్యంత ప్రాధాన్యత ఇస్తాయని కూడా బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో ఉంది. జపాన్‌కు చెందిన సుజుకి కంపెనీతో కొంతకాలంగా పెట్టుబడులపై సంప్రదింపులు జరిగాయని ప్రకటనలో ఉంది. అలాగే ఈ ఉదయం 10 గంటలా 45నిమిషాలకు సలార్పురియా నాలెడ్జ్ పార్కులో Bosch ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం కూడా ఉంది. ఈ రెండు కీలక సమావేశాల నేపథ్యంలో ఈ ఉదయం ఢిల్లీ చేరుకోవాల్సిన కేటీఆర్, ముఖ్యమంత్రి ప్రత్యేక అనుమతితో ఢిల్లీకి రాలేకపోయారని బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో ఉంది.

మరోవైపు బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు, సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, జేడీఎస్ పార్టీ అధ్యక్షుడు, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, తమిళనాడు విసికె పార్టీ అధ్యక్షుడు, ఎంపి తిరుమావళవన్, జాతీయ భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు గుర్నాం సింగ్, ఇతర రైతుసంఘాల నాయకులు, మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు కె. కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, కె.ఆర్. సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, పసునూరి దయాకర్ రావు, మాలోత్ కవిత, మన్నె శ్రీనివాసులు రెడ్డి, నామా నాగేశ్వర్ రావు, పి, రాములు, వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ కవితతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-14T20:13:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising