ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాస్త్రోక్తంగా మత్స్యగిరీశుడి బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2022-11-05T00:50:33+05:30

వలిగొండ మండలం వెంకటాపురంలో కొలువుదీరి న మత్స్యగిరి లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు శాస్ర్తోక్తంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం వేడుకల్లో భాగంగా పారాయణాలు, హోమాలు, చతుస్థానార్చన, బలిప్రదానం, శాత్తుమొర నిర్వహించారు. నారసింహుడి కల్యాణం సందర్భంగా శ్రీమత్‌భాగవత రామాయణాలు, పంచసూక్త పారాయణాలు పఠించారు.

ప్రత్యేక అలంకారంలో ఉత్సవమూర్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వలిగొండ, నవంబరు 4: వలిగొండ మండలం వెంకటాపురంలో కొలువుదీరి న మత్స్యగిరి లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు శాస్ర్తోక్తంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం వేడుకల్లో భాగంగా పారాయణాలు, హోమాలు, చతుస్థానార్చన, బలిప్రదానం, శాత్తుమొర నిర్వహించారు. నారసింహుడి కల్యాణం సందర్భంగా శ్రీమత్‌భాగవత రామాయణాలు, పంచసూక్త పారాయణాలు పఠించారు. యజ్ఞయాగాలను జరిపించేందుకు కొండపైన నిర్మించిన యజ్ఞశాలలో ఆగమ శాస్త్ర రీతిలో హోమం చేశారు. వేద పండితుల వేద పఠనంతో మత్స్యగిరి కొండ ఆధ్యాత్మికత సంతరించుకుంది. యాగశాలకు నాలుగు ముఖద్వారాలను ప్రతిష్ఠించారు. యాగశాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించేందుకు వేద మంత్రాలతో చతుస్థానార్చన చేశారు. దుష్ట శక్తులు ఆలయ ప్రాంగణంలో సంచరించకుండా నిరోధించేందుకు యాజ్ఞీకులు బలిప్రదానం చేశారు. ముక్కోటి దేవతలకు సప్తస్వరాలు, మృదంగనాదాలతో భేరీపూజ నిర్వహించారు. ఉత్సవమూర్తులకు శంఖుధార, చక్రధార మంగళస్నానం చేయించారు.

ఉత్సవమూర్తులకు ఘనంగా ఎదుర్కోళ్లు

మత్స్యగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎదుర్కోళ్ల ఉత్సవం వైభవంగా సాగింది. సంపదలకు నెలవైన లక్ష్మీదేవి అమ్మవారి అందచందాలను నరసింహస్వామి స్థు తిస్తూ ఎదుర్కోళ్ల మహోత్సవం వేద మంత్రోచ్ఛరణల నడుమ నిర్వహించారు.

నేడు స్వామివారి కల్యాణం

మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 12గంటలకు స్వామివారి కలాణమహోత్సవం నిర్వహించనున్నారు. కల్యాణ తం తును తిలకించడానికి హాజరయ్యే భక్తులకు ఆలయ అభివృద్ధి కమిటీ అన్ని వసతులు కల్పించింది. స్వామివారి కల్యాణం తిలకించి ఆయన కృపకు పాత్రులు కా వాలని ఆలయ నిర్వాహకులు కోరారు. కార్యక్రమాల్లో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీప్రతాపురం శ్రీనివాసాచార్యులు, దేవస్థాన ఈవో జయ రామయ్య, అభివృద్ధి కమిటీచైర్మన్‌ ముద్దసాని కిరణ్‌రెడ్డి, కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-05T00:50:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising