Governor Tamilisai: మళ్లీ అవమానం... ప్రోటోకాల్ పాటించని కలెక్టర్, ఎస్పీ
ABN, First Publish Date - 2022-11-10T12:46:40+05:30
తెలంగాణలో గవర్నర్ తమిళిసైకి అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఆమె ఎక్కడికి వెళ్లినా అక్కడి అధికారులు ఆమెకి స్వాగతం పలుకుతున్న పాపాన పోవడం లేదు.
సిద్దిపేట : తెలంగాణలో గవర్నర్ తమిళిసై (Governer Tamili sai)కి అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఆమె ఎక్కడికి వెళ్లినా అక్కడి అధికారులు ఆమెకి స్వాగతం పలుకుతున్న పాపాన పోవడం లేదు. పలుమార్లు ఈ విషయమై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా అధికారులు మాత్రం ప్రోటోకాల్ పాటించడం లేదు. తాజాగా సిద్దిపేట జిల్లాలో గవర్నర్ తమిళిసైకి అవమానం జరిగింది. ఆమెను సిద్దిపేట (Siddipet) జిల్లా కలెక్టర్, ఎస్పీలు అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం స్వాగతం పలికేందుకు సైతం ముందుకు రాలేదు. నేడు గవర్నర్ తమిళిసై కొమురవెల్లి మల్లన్న (Komuravelli Mallanna) ఆలయానికి వెళ్లారు. డీఆర్వో, ఆలయ అర్చకులు గవర్నర్కు స్వాగతం పలికారు. ప్రొటోకాల్ అంశంలో అసంతృప్తి తెలుపుతూ ఇటీవల గవర్నర్ వ్యాఖ్యలు చేశారు. అయినా అధికారులు తీరు మార్చుకోవడం లేదు. కాగా.. కొమరవెల్లి మల్లన్న దర్శనం పూర్తి చేసుకొని తమిళిసై దూల్మిట్ట మండలం బైరాన్ పల్లి గ్రామానికి వెళ్లారు.
Updated Date - 2022-11-10T13:27:51+05:30 IST