ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏబీఎన్ డిబేట్‌లో రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-10-31T21:17:21+05:30

రాహుల్‌ యాత్ర అద్భుతంగా కొనసాగుతోందని ABN డిబేట్‌లో టీపీసీపీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. చిల్లర ప్రచారాలకు అతీతంగా కొనసాగుతున్నదే భారత్‌ జోడో యాత్ర అని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాహుల్‌ యాత్ర అద్భుతంగా కొనసాగుతోందని ABN డిబేట్‌లో టీపీసీపీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. చిల్లర ప్రచారాలకు అతీతంగా కొనసాగుతున్నదే భారత్‌ జోడో యాత్ర అని తెలిపారు. భారత్‌ జోడో యాత్రలో ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. 8 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ లక్షల కోట్ల అప్పు చేశారని అన్నారు. అన్నింటిపైనా కేంద్రం జీఎస్టీ వేస్తూ పేదలను దోచుకుంటోందన్నారు. ప్రజాసమస్యలను మోదీ సర్కార్‌ పట్టించుకోవట్లేదని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనను బీజేపీ, టీఆర్ఎస్‌ గాలికొదిలేశాయని మండిపడ్డారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ, టీఆర్ఎస్‌ డ్రామాలడుతున్నాయన్నారు. ఫామ్‌హౌస్‌ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ, టీఆర్ఎస్‌ మధ్య బేరసారాలు నడుస్తున్నాయని ఆయన ఆరోపించారు.

పార్టీ జెండాను మోసే కార్యకర్తలను నేతలే కాపాడుకోవాలన్నారు. కార్యకర్తలకు అండగా ఉండలేని నేతలు ఎందుకు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అలాంటి నేతలున్నా ఒకటే.. లేకున్నా ఒకటేనన్నారు. బీజేపీలోకి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడును ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చెప్పాలి? అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యల్లో లాజికే లేదన్నారు.

Updated Date - 2022-10-31T21:20:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising