సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి లేఖ
ABN, First Publish Date - 2022-12-28T18:50:37+05:30
సీఎం కేసీఆర్ (CM KCR)కు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి (Revanth Reddy) లేఖ రాశారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ (CM KCR)కు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి (Revanth Reddy) లేఖ రాశారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే నిధులు విడుదల చేయాలన్నారు. అలాగే నిధులు విడుదల చేసి పంచాయతీలను ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం సర్పంచుల హక్కులను కాలరాస్తోందన్నారు. స్థానికసంస్థలు, గ్రామ పంచాయతీలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రేవంత్ లేఖలో పేర్కొన్నారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులనూ దారిమళ్లించారని ఆరోపించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే సర్పంచుల హక్కుల సాధన కోసం పోరాడతామని తెలిపారు. జనవరి 2న ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేపడతామని లేఖ ద్వారా తెలిపారు.
Updated Date - 2022-12-28T18:50:39+05:30 IST