ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Congress+bjp: అత్యాచారం కేసులో ఎమ్మెల్యే నన్నపనేని పీఏను శిక్షించండి

ABN, First Publish Date - 2022-12-02T14:30:21+05:30

యువతకు డబ్బు ఆశ జూపించి ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పీఏ శివ దగ్గరకు పంపించింది. అతనితో పాటు మరో ముగ్గురు లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను

ఎమ్మెల్యే నన్నపనేని పీఏను శిక్షించండి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: న్యాయశాస్త్ర విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ (Warangal East MLA Nannapaneni Narendra) పీఏ శివను కఠినంగా శిక్షించాలంటూ కాంగ్రెస్ నేతలు కొండా దంపతులు ఆందోళనకు దిగారు. ఎంజీఎం చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కొండా మురళీ, సురేఖ ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే నరేందర్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కొండా సురేఖ, మురళీ, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను అదుపులోకి తీసుకుని మట్టెవాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కొండా సురేఖ కామెంట్స్..

ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అండతో ఆయన పీఏ రెచ్చిపోయాడని కొండా సురేఖ(Konda Surekha) ధ్వజమెత్తారు. దళిత యువతిపై అత్యాచారం చేసి వేధించిన ఎమ్మెల్యే పీఏపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని.. బాధిత మహిళకు న్యాయం జరిగేవరకూ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని కొండా సురేఖ తెలిపారు.

ఎర్రబెల్లి ప్రదీప్ రావు.. సంచలన ఆరోపణలు

అత్యాచారం కేసులో ఎమ్మెల్యే నరేందర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందని బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే పీఏ శివపై ఫోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. ఈ కేసులో అసలు దోషులను తప్పించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. పోలీసులు.. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గినట్లు తెలుస్తోందన్నారు. నిజాలు వెలుగు తీసి దోషులందరికీ శిక్ష పడేలా సీబీఐ ఎంక్వైరీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బాలసముద్రంలో ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ విద్యార్థిని ఎల్‌ఎల్‌బీ చదువుతోంది. వార్డెన్‌ శోభ.. యువతకు డబ్బు ఆశ జూపించి ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పీఏ శివ దగ్గరకు పంపించింది. అతనితో పాటు మరో ముగ్గురు లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించారు. అత్యాచారంతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2022-12-02T14:30:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising