High Alert: తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో హై అలెర్ట్
ABN, First Publish Date - 2022-10-26T10:14:25+05:30
తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో హై అలెర్ట్ కొనసాగుతోంది. నిన్న కొత్తపల్లి గ్రామానికి చెందిన జాడీ బసంత్ అనే వ్యక్తిని ఇంఫార్మర్ నెపంతో మావోయిస్టులు హత్య చేశారు.
ములుగు: తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో హై అలెర్ట్ కొనసాగుతోంది. నిన్న కొత్తపల్లి గ్రామానికి చెందిన జాడీ బసంత్ అనే వ్యక్తిని ఇంఫార్మర్ నెపంతో మావోయిస్టులు హత్య చేశారు. మావోయిస్టుల చెరలో మరో ఇద్దరు యువకులు ఉన్నారు. ఇటీవలే ఈ ప్రాంతంలో డీజీపీ మహేందర్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. 2020 అక్టోబర్ 4న ఏజెన్సీలో డీజీపీ పర్యటించిన వారం తర్వాత వెంకటాపురం మండలంలోని ఆలుబాక గ్రామానికి చెందిన మాడూరి భీమేశ్వరరావు (బీసు) అనే వ్యాపారిని మావోయిస్టులు హతమార్చారు. ఏజెన్సీలో డీజీపీ పర్యటనలు చేసినప్పుడల్లా ఇన్ఫార్మర్ల పేరుతో మావోయిస్టులు హత్యలకు పాల్పడుతున్నారు. మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకోవటానికే అని పోలీసులు అంటున్నారు.
Updated Date - 2022-10-26T10:14:26+05:30 IST