ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YuvagalamPadayatra: 1000 కి.మీ. పూర్తి చేసుకున్న లోకేష్‌ పాదయాత్ర

ABN, First Publish Date - 2023-04-21T21:54:40+05:30

టీడీపీ నేత నారా లోకేశ్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) 1000 కి.మీ. మైలు రాయిని చేరుకుంది. ఈ సందర్భంగా ఆదోని పట్టణం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదోని: టీడీపీ నేత నారా లోకేశ్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) 1000 కి.మీ. మైలు రాయిని చేరుకుంది. ఈ సందర్భంగా ఆదోని పట్టణం (Adoni town)లోని 21వ వార్డును దత్తత తీసుకుంటున్నట్లు నారా లోకేశ్‌ (Nara Lokesh) తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతిపథంలో నడిపించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. తాగునీరు, డ్రైనేజి, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పిస్తానన్నారు. ‘‘యువగళం పాదయాత్ర రాయలసీమ (Rayalaseema) గడ్డపై 1000 కి.మీ. మైలురాయి చేరుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నారు. సహాయ, సహకారాలు అందించిన యావత్‌ రాయలసీమ ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యాత్రను సఫలీకృతం చేసిన ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. రాయలసీమ ప్రజలకు సీఎం జగన్ (CM Jagan) చేసిన అన్యాయాలను ఎండగట్టేందుకు ఈ యాత్ర ఒక ఆయుధంలా ఉపయోగపడింది. రాయలసీమలోని ప్రతి కుటుంబాన్ని సుభిక్షంగా మార్చాలన్నది నా ఆకాంక్ష. రాష్ట్రంలో జగన్‌ అరాచక పాలనను అంతమొందించేందుకు నేను యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టాను. ఈ సందర్భంగా రాయలసీమ సమగ్ర అభివృద్ధి కోసం యువత ఆలోచనలు, అభిప్రాయాలను వాట్సాప్‌ నెంబరు 9686296862కు తెలియజేయాలి’’ అని లోకేశ్‌ విన్నవించారు.

త్వరలో జగన్‌కు బైబై..

యువగళంతో ప్రజల్లో మార్పు మొదలైంది. త్వరలోనే జగన్‌కు ప్రజలు బైబై చెప్పడం ఖాయమన్నారు. నిసిగ్గుగా అబద్ధాలు చెప్పడంలో జగన్‌ దిట్ట. జగన్‌కు డబ్బు లేదంటా..? వైసీపీ భాషలోనే అడుగుతున్నా. దేశంలో అత్యంత ధనవంతుడైన సీఎం ఎవరని ప్రశ్నించారు. జగన్‌ మాటలు వింటుంటే.. అబద్ధాలే సిగ్గుపడుతున్నాయన్నారు. బెంగళూరు, హైదరాబాదు, ఇడుపులపాయ, తాడేపల్లెలో కాపురం పెట్టావు.. ఇప్పుడు విశాఖలో కాపురం పెడుతానంటున్నావు.. కాపురం పెట్టడం కాదు.. అముల్‌బేబీ ఏం పికావ్‌ అన్నది ముఖ్యమన్నారు. 2024లో లండన్‌లో జగన్‌ కాపురం పెట్టడం ఖాయమని అన్నారు. ఆదోని అదిరిపోయింది.. ఈ జన స్పందన చూసి జగన్‌ ముఖచిత్రం మారిపోవడం ఖాయమని లోకేశ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2023-04-21T21:54:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising