Temperature: మండిన రాష్ట్రం... కడపలో 44.14 డిగ్రీలు
ABN, First Publish Date - 2023-04-13T21:30:31+05:30
ఎండకు గురువారం రాష్ట్రంలో అనేక ప్రాంతాలు మండిపోయాయి. కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు, కొన్నిచోట్ల తీవ్ర వడగాడ్పులు వీచాయి.
విశాఖపట్నం: ఎండకు గురువారం రాష్ట్రంలో అనేక ప్రాంతాలు మండిపోయాయి. కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు, కొన్నిచోట్ల తీవ్ర వడగాడ్పులు వీచాయి. కోస్తాలో పగటి ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఐదు, రాయలసీమ (Rayalaseema)లో రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదు కావడంతోపాటు వడగాడ్పులు వీచాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా గురువారం 11 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 60 మండలాల్లో గాడ్పులు వీచినట్టు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీలు, ఒకటి, రెండు ప్రాంతాల్లో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కడప (Kadapa)లో 44.14 డిగ్రీలు నమోదైంది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా ఎండ తీవ్రత నేపథ్యంలో విశాఖ ఏజెన్సీతోపాటు కోస్తాలో కొన్నిచోట్ల చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Updated Date - 2023-04-13T21:30:31+05:30 IST