పావురాన్ని పట్టుకున్న యువకులకు షాకింగ్ సీన్.. కాలికి కట్టి ఉన్న ప్లాస్టిక్ ట్యాగులను పరిశీలించగా..
ABN, First Publish Date - 2023-02-19T20:51:42+05:30
అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitaramaraju District) ఎటపాక మండలం టీపీవీడు పంచాయతీలోని గోదావరి ఒడ్డున ఉన్న గొల్లగూడెంలో పావురం కలకలం రేపింది.
విశాఖ: అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitaramaraju District) ఎటపాక మండలం టీపీవీడు పంచాయతీలోని గోదావరి ఒడ్డున ఉన్న గొల్లగూడెంలో పావురం కలకలం రేపింది. పావురం కాళ్లకు రబ్బరుతోపాటు ప్లాస్టిక్ ట్యాగులతో జీపీఆర్ కోడ్‌లతో పలు నెంబర్లు ఉండడంతో చర్చనీయాంశమైంది. ఆకాశంలో ఎగురుతున్న పావురంను గద్ద దాడి చేయడంతో పావురం (pigeon) గాయంతో మిర్చితోటలో పడిపోయింది. కిందపడ్డ పావురాన్ని స్థానికులు పరిశీలించారు. పావురం కాళ్లకు రబ్బరు, ప్లాస్టిక్ ట్యాగులతో పలు నెంబర్లు కన్పించాయి. జీపీఆర్ కోడ్‌తో ప్లాస్టిక్ ట్యాగులో మధ్యలో 22 చివరిన 1444 కోడ్ కలిగి ఉన్నాయి. అలాగే రబ్బరు ట్యాగ్‌లో 5186 నెంబరు కోడ్ ఉంది.
నంబర్లు ఉండడంతో స్థానికల్లో ఆందోళన మొదలైంది. దీనిని గూడచార వ్యవస్థగా అనుమానిస్తూ జోరుగా ప్రచారం సాగింది. గతంలో ఇలాంటి ఏమైనా జరిగాయా అని ఆరా తీశారు. ఏజెన్సీలో ఈ తరహాలో ఎప్పుడూ పావురం ద్వారా గూడాచార్య వ్యవస్థ జరిగిన దాఖలాలు లేవనే కొందరు తెలిపారు. పోలీసులకు విషయం తెలియడంతో పావురంను అదుపులోకి తీసుకుని, వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పావురం చెన్నైకి చెందినదిగా గుర్తించామని పోలీసులు తెలిపారు. గత వారంలో తెలంగాణలోని వరంగల్‌లో నిర్వహించిన 550 కిలో మీటర్ల పావురాల పందేల్లో ఆ పావురమే తప్పిపోయిందని, తప్పిపోయిన పావురం ఇటువైపు వచ్చిందని పోలీసులు ధ్రువీకరించారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
Updated Date - 2023-02-19T20:57:15+05:30 IST