Durgamma Temple: దుర్గగుడిలో కనిపించని ఆధ్యాత్మిక శోభ
ABN, First Publish Date - 2023-10-18T12:55:54+05:30
ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ గుడిలో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న వేళ ఆధ్యాత్మిశోభ కనిపించకుండా పోయింది.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ గుడిలో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న వేళ ఆధ్యాత్మిశోభ కనిపించకుండా పోయింది. ఆలయంలో చిన్న రాజగోపురం అలంకారానికి నోచుకోని పరిస్థితి. ఆలయ ప్రాంగణంలో వాడిపోయిన తోరణాలు, అరటి ఆకులు దర్శనమిస్తున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఆలయ అలంకరణలో అధికారుల తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దసరా నవరాత్రి ఉత్సవాలు వచ్చాయంటే చాలు గతంలో ఆలయాన్ని పూలతో సంపూర్తిగా అలంకరించడం జరిగేది. అయితే ఈ ఏడాది మాత్రం అలంకరణను నామమాత్రంగానే జరిపారు. ఆలయ అలంకరణలో శ్రద్ధ చూపని అధికార యంత్రాగం.. వీఐపీ, వీవీఐపీ సేవలో తరిస్తోంది. అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు.
Updated Date - 2023-10-18T12:55:54+05:30 IST