Aarogya Sri: ఇకపై ఏపీలో ఆరోగ్య శ్రీ లేనట్టేనా?..
ABN, First Publish Date - 2023-05-18T15:34:43+05:30
రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఉచితంగా వైద్యం అందించే ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి.
అమరావతి: రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఉచితంగా వైద్యం అందించే ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. రేపటి (శుక్రవారం) నుంచి పూర్తిగా నిలిపివేయాలని నెట్‌వర్క్ ఆసుపత్రులు భావిస్తున్నాయి. ఇప్పటికే అత్యవసర చికిత్సలు మినహా మిగతా సేవలను ఆస్పత్రులు నిలిపివేసిన విషయం తెలిసిందే. దాదాపు రూ.750 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉండటంతో సేవలు నిలిపివేయాలని ఆస్పత్రులు నిర్ణయించాయి. కేంద్రం నుంచి ఆయుష్మాన్ భారత్ కింద వచ్చిన నిధులను రాష్ట్ర సర్కార్... మెడికల్ కళాశాలల నిర్మాణానికి మళ్లించింది. దీంతో ఆయుష్మాన్ భారత్ కింద నిధులను కేంద్రం నిలిపివేసింది. మరోవైపు నెట్‌వర్క్ ఆసుపత్రులు సేవలు నిలిపివేస్తున్నారని సమాచారం తెలియడంతో ఆరోగ్య శ్రీ నుంచి ఆసుపత్రుల యాజమాన్యాలకు మెసేజ్‌లు వెళ్లాయి. త్వరలో నిధులు సర్దుబాటు చేస్తామని ట్రస్ట్ అధికారులు నచ్చచెబుతున్న పరిస్థితి. పేషెంట్‌ల వారీగా బిల్లులను అధికారులు అప్పుడప్పుడూ పంపిస్తున్నారు. అయితే ఏప్రిల్ 30న రూ.200 కోట్లు ఇచ్చారని వచ్చిన వార్తలు వాస్తవం కాదని నెట్‌వర్క్ ఆసుపత్రులు చెబుతున్నాయి.
Updated Date - 2023-05-18T15:34:43+05:30 IST