ABN Dastagiri Interview: ఇంటర్వ్యూలో దస్తగిరి ఇలా అనేశాడేంటి.. పులివెందులలో టీ షాప్‌కు వెళ్లి అడిగినా..
ABN, First Publish Date - 2023-04-18T18:25:42+05:30
వివేకా హత్య కేసులో (YS Viveka Case) ఏ-4 నిందితుడిగా ఉన్న దస్తగిరి ఏబీఎన్‌కు ఎక్స్‌క్లూజివ్‌గా ఇంటర్వ్యూ (ABN Dastagiri Interview) ఇచ్చాడు. ఈ సందర్భంగా దస్తగిరి మాట్లాడుతూ..
హైదరాబాద్: వివేకా హత్య కేసులో (YS Viveka Case) ఏ-4 నిందితుడిగా ఉన్న దస్తగిరి ఏబీఎన్‌కు ఎక్స్‌క్లూజివ్‌గా ఇంటర్వ్యూ (ABN Dastagiri Interview) ఇచ్చాడు. ఈ సందర్భంగా దస్తగిరి మాట్లాడుతూ.. తప్పు తెలుసుకున్నాను కాబట్టే అప్రూవర్‌గా (Viveka Case Approver Dastagiri) మారానని దస్తగిరి చెప్పాడు. హత్య తర్వాత తనను ఎవరూ పట్టించుకోలేదని, ఎవరి కోసమో తానెందుకు ఇబ్బందులు పడాలని ప్రశ్నించాడు. తాను ఎవరితోనూ చేతులు కలపలేదని, ఎవరి నుంచీ తాను డబ్బులు తీసుకోలేదని ABNతో దస్తగిరి చెప్పాడు. కేసుకు సంబంధించి ప్రతీ సాక్ష్యం సీబీఐ దగ్గర ఉందని, ఇప్పటికే పాత్రధారులం చిక్కామని.. త్వరలోనే సూత్రధారులు కూడా బయటకు వస్తారని దస్తగిరి వ్యాఖ్యానించడం గమనార్హం. అవినాశ్‌ను కేసులో (Avinash Reddy) ఇరికిస్తే సీబీఐకి ఏం లాభమని దస్తగిరి లాజిక్ పాయింట లేవనెత్తడం కొసమెరుపు.
సాక్ష్యాల ఆధారంగానే సీబీఐ విచారణ చేస్తుందని, వివేకా హత్య వెనుక వ్యక్తిగత, ఆస్తి తగాదాలు ఉంటాయనుకోవడం లేదని అభిప్రాయపడ్డాడు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు నాలుగేళ్లుగా అధికారంలో ఉండి తప్పు చేయకుంటే ఎందుకు ఖండించడం లేదని ABNతో ఇంటర్వ్యూలో దస్తగిరి నిలదీశాడు. ఎంపీ టికెట్ కోసమే వివేకా హత్య జరిగిందని షర్మిల కూడా అన్నారని, చెల్లి అయిన సునీతారెడ్డే ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వ తీరుపై దస్తగిరి పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. వివేకాను ఎవరు చంపారో పులివెందులలో టీ షాప్‌కు వెళ్లి అడిగినా చెబుతారని, నిందితులు తప్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారని దస్తగిరి చెప్పడం గమనార్హం.
వివేకా హత్య కేసు ముగింపు దశకు వచ్చిందని, హత్య ఎవరు చేయించారో రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి తెలుసని ఏబీఎన్ ఇంటర్వ్యూలో దస్తగిరి చెప్పాడు. తనకు ప్రాణహాని ఉందని, భద్రత కావాలని ABNతో దస్తగిరి తెలిపాడు. తనకు వెపన్ అవసరం లేదని, భద్రత కల్పించాలని దస్తగిరి కోరాడు. తన కుటుంబం జోలికి వస్తే బాగుండదని, తన సెక్యూరిటీని ఇబ్బందులు పెడుతున్నారని ABNతో దస్తగిరి చెప్పాడు. సీబీఐ గానీ, సునీతారెడ్డి గానీ తనకు డబ్బులు ఇచ్చినట్లు నిరూపించాలని, జైలుకు వెళ్లడానికి తాను సిద్ధం అని.. నిరూపించలేకపోతే మీరు పార్టీకి, పదవులకు రాజీనామా చేయాలని దస్తగిరి సవాల్ చేశాడు.
Updated Date - 2023-04-18T18:25:47+05:30 IST