CBN Arrest : తీర్పు తర్వాత.. చంద్రబాబు లాయర్లకు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్!
ABN, First Publish Date - 2023-09-12T18:38:07+05:30
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development) టీడీపీ అధినేత చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌ను (CBN House Custody) ఏసీబీ కోర్టు తీరస్కరించింది. ఈ తీర్పు తర్వాత..
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development) టీడీపీ అధినేత చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌ను (CBN House Custody) ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఈ తీర్పు తర్వాత.. బాబు లాయర్ల వినతిని కోర్టు అనుమతించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు పత్రాల పరిశీలనకు ( Skill Development Case Documents) గాను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. లాయర్లకు అనుమతించారు. సోమవారం నాడు చంద్రబాబు హౌస్ కస్టడీకి సంబంధించిన పిటిషన్‌తో పాటు డాక్యమెంట్ పరిశీలనకు అనుమతిని కోరుతూ కోర్టులో లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. నిన్న సాయంత్రానికే అనుమతి వస్తుందని లాయర్లు భావించినప్పటికీ రాలేదు. కస్టడీ పిటిషన్‌పైనే నిన్న తీర్పు రాకపోవడంతో.. ఈ పిటిషన్ కూడా కోర్టు పరిగణనలోకి తీసుకున్నది కానీ న్యాయస్థానం పక్కనెట్టింది. ఇవాళ తీర్పు తర్వాత పత్రాల పరిశీలనకు అనుమతిచ్చింది కోర్టు.
పరిశీలన తర్వాత ఏంటి..?
ప్రస్తుతం డాక్యుమెంట్లను సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, ఆయన టీమ్ నిశితంగా పరిశీలిస్తోంది. అనంతరం వారికున్న అభ్యంతరాలను కోర్టుకు దృష్టికి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత సీఐడీ, చంద్రబాబు తరఫున లాయర్లు వాదనలు జరిగే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబుపై నమోదైన మూడు అక్రమ కేసుల్లో బెయిల్ పిటీషన్‌లు దాఖలు చేయాలని న్యాయవాదుల నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం పిటీషన్‌లను దాఖలు చేయడానికి చంద్రబాబు తరపు న్యాయవాదులు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే హౌస్ కస్టడీని తిరస్కరించడంతో రేపు వేయబోయే పిటిషన్లపై ఏసీబీ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి
NCBN : ఉత్కంఠకు తెర.. చంద్రబాబు హౌస్ కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పు ఇదీ..
NCBN Arrest : చంద్రబాబును హౌస్ రిమాండ్‌కు ఇవ్వాలని లూథ్రా ఎందుకు అడుగుతున్నారంటే..?
CBN House Custody : ముగిసిన వాదనలు.. మరో అరగంటలో కీలక తీర్పు
NCBN Arrest : చంద్రబాబు కేసుపై ఏసీబీ కోర్టులో వాడివేడిగా వాదనలు.. లూథ్రా టీమ్ ఏం చేయబోతోంది..!?
Skill Development Case : చంద్రబాబు కేసులో హోరాహోరీగా వాదనలు.. జడ్జి లాజిక్ ప్రశ్నలతో సీఐడీ షాక్..!
Updated Date - 2023-09-12T18:42:00+05:30 IST