ACB court judge: చంద్రబాబును విచారణ చేసే సమయంలో నిబంధనలు పాటించండి
ABN, First Publish Date - 2023-09-22T19:30:55+05:30
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును (Chandrababu) విచారణ చేసే సమయంలో కొన్ని నిబంధనలు పాటించాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి (ACB court judge) పేర్కొన్నారు.
విజయవాడ: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును (Chandrababu) విచారణ చేసే సమయంలో కొన్ని నిబంధనలు పాటించాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి (ACB court judge) పేర్కొన్నారు.
"కస్టడీకి తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత చంద్రబాబుకి వైద్య పరీక్షలు జరపండి. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్. విచారణ సమయంలో గంటకు 5 నిమిషాలు చంద్రబాబు బ్రేక్." అని న్యాయమూర్తి వెల్లడించారు.
చివరిగా 9.30 నుంచి 5 గంటల వరకు విచారణ సమయాన్ని జడ్జి నిర్ణయించారు. చంద్రబాబు పిటిషన్లు అన్నీ సోమవారం విచారణ చేస్తామని ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.
8 మంది న్యాయవాదుల పేర్లు ఏసీబీ జడ్జికి చంద్రబాబు తరపు న్యాయవాదులు ఇచ్చారు. వీరిలో గుంజుపల్లి సుబ్బారావు, దమ్మాల పాటి శ్రీనివాసులు చంద్రబాబు విచారణ సమయంలో ఉంటారని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. 12 మంది విచారణ అధికారుల పేర్లను సీఐడీ అధికారులు న్యాయమూర్తికి ఇచ్చారు.
Updated Date - 2023-09-22T19:30:55+05:30 IST