ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదిరెడ్డి వాసు, అప్పారావుకు బెయిల్ మంజూరు

ABN, First Publish Date - 2023-05-10T12:16:15+05:30

టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత నెల 30 వ తేదిన అప్పారావు, వాసులను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి : టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత నెల 30 వ తేదిన అప్పారావు, వాసులను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. జగజ్జననీ చిట్‌ ఫండ్‌ కంపెనీ కేసులో వీరిద్దరినీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. జగజ్జననీ చిట్‌ ఫండ్‌ కంపెనీలో చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారని పేర్కొంటూ చిట్స్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ (కాకినాడ) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి సీఐడీ పోలీసులు గత నెల 29న ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసుపై కేసు నమోదు చేశారు. ఆ మరుసటి రోజు సీఐడీ అధికారులు వారిద్దరినీ అరెస్ట్‌ చేసి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముందు హాజరు పరచగా రిమాండ్‌ విధించారు.

జగజ్జననీ చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (జేసీ ఎఫ్‌పీఎల్‌) కంపెనీకి వీరు డైరెక్టర్లుగా ఉన్నారు. అప్పారావు కుమార్తె వెంకట జ్యోత్స్న కూడా డైరెక్టర్‌. కానీ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. ఈ సంస్థ చిట్స్‌ ఆర్థిక లావాదేవీలు, చెల్లింపుల్లో తేడాలున్నాయని కాకినాడలోని అసిస్టెంట్‌ రిజిస్ర్టార్‌ ఆఫ్‌ చిట్స్‌ కోర్ని వరప్రసాద్‌ శనివారం రాత్రి 8గంటల సమయంలో అమరావతిలోని మంగళగిరి సీఐడీ పీఎ్‌సలో ఫిర్యాదు చేశారు. వెంటనే ఎపీపీడీఎ్‌ఫఈ చట్టం 1999, 1982 చిట్‌ఫండ్స్‌ చట్టంలోని సెక్షన్‌ 76, 79 కింద, 420, 409, 120(బి), 477(ఎ), ఆర్‌/డబ్ల్యు 34ఐపీసీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తెల్లవారకుండానే వచ్చి కనీసం ముఖం కూడా కడుక్కోకుండానే అదుపులోకి తీసుకున్నారు. ఈ చిట్స్‌ లావాదేవీలు బ్యాంక్‌ ద్వారా సుమారు రూ.11కోట్లు నిర్వహించినట్టు స్టాంఫ్స్‌ అండ్‌ రిజిస్రేష్టషన్‌ ఆఫీసు ఏలూరులో ఓచర్లు సమర్పించారని, కానీ అందులో కొంత నగదు రూపేణా ఉన్నట్టు ఆరోపిస్తూ చిట్స్‌ అధికారులు ఫిర్యాదు చేశారని ఆదిరెడ్డి లాయర్‌ రాంబాబు తెలిపారు. ఈ విషయం గురించి సీఐడీ అధికారులను ప్రశ్నించగా ఈ కేసును తాము విచారించలేదని, చిట్స్‌ అధికారి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని చెప్పారన్నారు. మంగళగిరికి చెందిన సీఐడీ అధికారులు, శ్రీకాకుళానికి చెందిన డీఎస్పీ నాయుడు, స్థానిక సీఐడీ అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2023-05-10T12:16:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising