ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిర్‌పోర్టు అధికారి చేతివాటం!

ABN, First Publish Date - 2023-02-22T21:22:24+05:30

శ్రీవాణి ట్రస్టు (Srivani Trust) దాతలకు విక్రయించే వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లలో ఎయిర్‌పోర్టు (Airport)లోని ఓ అధికారి చేతివాటం ప్రదర్శించినట్టు తెలిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: శ్రీవాణి ట్రస్టు (Srivani Trust) దాతలకు విక్రయించే వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లలో ఎయిర్‌పోర్టు (Airport)లోని ఓ అధికారి చేతివాటం ప్రదర్శించినట్టు తెలిసింది. నకిలీ బోర్డింగ్‌ పాసులతో ఆయన ఐదు వీఐపీ బ్రేక్‌ టికెట్లను పొందినట్టు విజిలెన్స్‌ అధికారులు (Vigilance officers) తనిఖీల్లో గుర్తించారు. విజిలెన్స్‌ అధికారుల కథనం మేరకు.. శ్రీవాణిట్రస్టుకు విరాళాలందించే దాతలకు రోజుకు వెయ్యి టికెట్లను టీటీడీ (TTD) కేటాయిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో 250 టికెట్లు విమానాశ్రయంలో జారీ చేస్తున్నారు. బోర్డింగ్‌పాస్‌ ఉన్న వారికి మాత్రమే కరెంట్‌బుకింగ్‌ టికెట్లు కేటాయిస్తారు. శ్రీవాణిదాతలు బ్రేక్‌ దర్శన టికెట్‌కు బోర్డింగ్‌ పాస్‌ను జతచేసి టికెట్‌పై ఎయిర్‌లైన్‌ రిఫరెన్స్‌తో కూడిన పీఎన్‌ఆర్‌ నెంబరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటినీ తిరుమల (Tirumala)లోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో తనిఖీ చేసిన తర్వాత దర్శనానికి అనుమతిస్తారు.రెండువారాల క్రితం నకిలీ బోర్డింగ్‌ పాసులతో ఐదు వీఐపీ బ్రేక్‌ టికెట్లు పొందిన భక్తులు దర్శనానికి రావడాన్ని విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు.విచారించగా ఎయిర్‌పోర్టులోని ఓ అధికారి సహాయంతో వీటిని పొందినట్టు తేలింది.దీంతో విజిలెన్స్‌ అధికారులు ఎయిర్‌పోర్టు అధికారితో పాటు అక్కడి సిబ్బందిని విచారిస్తున్నట్టు సమాచారం.

తిరుమలలోనూ శ్రీవాణి టికెట్ల జారీ

ప్రస్తుతం తిరుపతి ఎయిర్‌పోర్టులో రోజుకు 250 టికెట్లను అందుబాటులో ఉంచుతున్నప్పటికీ 50 నుంచి 60 టికెట్లు మాత్రమే భక్తులు పొందుతున్నారు. ఆన్‌లైన్‌లో 750టికెట్లను జారీ చేస్తున్నారు.భక్తులనుంచి స్పందన లేకపోవడంతో ఆన్‌లైన్‌ టికెట్లను 500కు, ఎయిర్‌పోర్టులో వంద టికెట్లకు కుదించారు. ఈ 400 టికెట్లను తిరుమలలో ఆఫ్‌లైన్‌ పద్ధతిలో జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు.బుధవారం నుంచి తిరుమలలో జేఈవో కార్యాలయంలో శ్రీవాణిదాతలకు టికెట్ల జారీ ప్రక్రియను ప్రారంభించారు.

Updated Date - 2023-02-22T21:22:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising