ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Alla Ramakrishnareddy:వైసీపీకి ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజీనామాకు అసలు కారణమిదే...

ABN, First Publish Date - 2023-12-11T14:27:52+05:30

Andhrapradesh: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.

అమరావతి: వైఎస్సార్‌సీపీ కీలక నేత, మంగళగిరి శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి (Alla Ramakrishna Reddy) పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. 2014 నుండి 2019 వరకు ఒకసారి, 2019 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారని కృతజ్ఞతలు తెలిపారు. నీతీనిజాయితీలతో ధర్మంగా శాసనసభ్యుడిగా పనిచేశానని, ఒక వైపు బాధగా ఉన్నప్పటికీ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

మొదటగా శాసన సభ్యుడిగా రాజీనామా చేశానని, స్పీకర్ ఫార్మాట్‌లో లేఖ ఇచ్చానని వెల్లడించారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో స్పీకర్ ఓఎస్‌డీకి లేఖను అందించినట్లు చెప్పారు. తన రాజీనామాను ఆమోదించమని కోరానని తెలిపారు. 1995 నుంచి రాజకీయాల్లో ఉన్నానన్నారు. ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి కోసం పనిచేశానని.. 2004లో కాంగ్రెస్ నుంచి సత్తెనపల్లి సీట్ ఆశించి భంగపడ్డానన్నారు. 2009లో పెదకూరపాడు సీట్‌ను కాంగ్రెస్ నుంచి ఆశించి భంగపడ్డానన్నారు. అయినా కూడా కాంగ్రెస్‌ కోసం పనిచేశానన్నారు. వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యే పదవికి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇన్నాళ్లు తనకు రాజకీయంగా అవకాశం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డికి ఆళ్ల రామకృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.

Updated Date - 2023-12-11T14:47:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising