ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anantapuram: మద్యం మత్తులో అల్లరి చేష్టలకు దిగిన నలుగురిపై చర్యలు..

ABN, First Publish Date - 2023-07-30T10:15:13+05:30

అనంతపురం జిల్లా: కంబదూరులో మద్యం మత్తులో అల్లరి చేష్టలకు దిగిన నలుగురిపై చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా, కంబదూరు మండల కేంద్రంలోని పీర్ల గుడి వద్ద నిన్న రాత్రి మద్యం మత్తులో...

అనంతపురం జిల్లా: కంబదూరులో మద్యం మత్తులో అల్లరి చేష్టలకు దిగిన నలుగురిపై చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా, కంబదూరు మండల కేంద్రంలోని పీర్ల గుడి (Pirla Gudi) వద్ద నిన్న రాత్రి మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు న్యూసెన్స్ సృష్టించారని కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడికెళ్లి వారి అల్లరి చేష్టలను సద్దుమణిచారు. ఇందులో నలుగురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలకు ఉపక్రమించామని డీఎస్పీ తెలిపారు.

పూర్తి వివరాలు...

కంబదూరు మండల కేంద్రంలో మొహరం (Muharram) పండుగ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పాత కక్షలు నేపథ్యంలో పీర్ల గుడి వద్ద గొడవ మొదలైంది. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుంటూ కర్రలతో, కొడవలితో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు.. వన్నూరు భాష, సాదిక్ భాషా, నూర్ భాషా, సుభాన్‌లుగా గుర్తించారు. క్షతగాత్రులను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగదా డీఎస్పీ, సిఐ, ఎస్ఐల నేతృత్వంలో కంబదూరులో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2023-07-30T10:15:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising