ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anantapuram: ఆయన వైకాపా నాయకుడిగా ప్రవర్తిస్తున్నారు: రాంభూపాల్

ABN, First Publish Date - 2023-02-17T14:46:23+05:30

అనంతపురం: ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి (Pratap Reddy) అధికారిగా కాకుండా వైకాపా (YSRCP) నాయకుడిగా ప్రవర్తిస్తున్నారని సీపీఎం (CPM) అనంతపురం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ (Rambhupal) విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి (Pratap Reddy) అధికారిగా కాకుండా వైకాపా (YSRCP) నాయకుడిగా ప్రవర్తిస్తున్నారని సీపీఎం (CPM) అనంతపురం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ (Rambhupal) విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియ (Nomination Process) మొదలు పెట్టారని.. ఎన్నికల కోడ్ (Election Code) అమలులో ఉండగా ఉపాధ్యాయుల (Teachers)తో మీటింగ్ (Meeting) ఎలా పెట్టారు.. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం కాదా?.. అని ప్రశ్నించారు. రౌడీయిజం చేయడానికి అనంతపురం జిల్లాకు వచ్చారా? అన్నారు. మీటింగ్‌లో పాల్గొన్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

రహస్య మీటింగ్‌కు విద్యార్థి సంఘాలు పోతే... అక్కడ మందు, డబ్బులు ఇస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహించారని రాంభూపాల్ ఆరోపించారు. విద్యార్థుల నాయకులపై ఆర్జెడీ ప్రతాప్ రెడ్డి దాడి చేసి... మళ్ళీ విద్యార్థి నాయకులపైనే కేసులు పెట్టారన్నారు. కేవలం కుట్రలు, కుతంత్రాలపై ఆధారపడి ఎన్నికల్లో గెలవాలని వైసీపీ నేతలు చూస్తున్నారని మండిపడ్డారు. సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకొని.. వాటి ఆధారంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ ఆర్జేడీని విధుల నుంచి తొలగించాలని... లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని రాంభూపాల్ హెచ్చరించారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ (Jafar) మాట్లాడుతూ కర్నూలు, కడపలో ఆర్జేడీ టిఫిన్ బాక్సులు పంపిణీ చేశారని ఆరోపించారు. రాజకీయంగా ఒప్పందాలు చేసుకుని అనంతపురం ఆర్డీటీ అతిథి గృహంలో రహస్య సమావేశం నిర్వహించారన్నారు. వైకాపా నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడితే ఆర్జెడీ మద్దతు ఇస్తోందని విమర్శించారు. ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఇలాంటి వారిని ఓడించి బుద్ది చెప్పాలని జాఫర్ పిలుపిచ్చారు.

Updated Date - 2023-02-17T14:46:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising