ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

JC Prabhakara Reddy: నారా లోకేష్ పాదయాత్రపై జేసీ ప్రభాకరరెడ్డి భావోద్వేగం..

ABN, First Publish Date - 2023-04-14T11:10:47+05:30

అనంతపురం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్రపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి (JC Prabhakara Reddy) భావోద్వేగానికి లోనయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అనంతపురం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్రపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి (JC Prabhakara Reddy) భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ లోకేష్ ఒక కర్మజీవి అని, కాళ్ళ బొబ్బలు పగిలాయని, కళ్ళల్లో నీళ్లు వచ్చాయన్నారు. లోకేష్ ఆంధ్ర ప్రజల కోసం పాదయాత్ర (Padayatra) చేస్తున్నారని.. గొప్ప లీడర్ అని కొనియాడారు. తనకే ఇంత ఉంటే.. లోకేష్ కుటుంబ సభ్యులు ఎలా వున్నారోనని అన్నారు. లోకేష్‌తో తన కొడుకు మూడు రోజులు నడిచినందుకు కాళ్ళు నొప్పులు అంటున్నాడన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడేందుకు లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని, సక్సెస్ అయ్యారని.. ఆయన కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని జేసీ స్పష్టం చేశారు.

రివెంజ్ అనొద్దని.. అందర్నీ క్షమిద్దామని.. జేసీ ప్రభాకరరెడ్డి.. చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. కొంతమంది అధికారులు ఉన్నారు... వాళ్లను మాత్రం విడిచిపెట్టొద్దన్నారు. కష్టమైన పర్వాలేదని.. లోకేష్ పాదయాత్ర చేయాలన్నారు. లోకేష్ ప్రజల మనిషిని.. చేసిన పనులు వల్ల చంద్రబాబు ప్రజల మనిషి అయ్యారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. లోకేష్ నడుస్తుంటే తనకు బాధ వేస్తోందని.. విష్ యూ అల్ గుడ్ లక్ లోకేష్.. అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.

Updated Date - 2023-04-14T11:10:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising