Anantapuram Dist.: మొహరం పండుగ.. రెండు వర్గాల మధ్య ఘర్షణ
ABN, First Publish Date - 2023-07-30T09:12:19+05:30
అనంతపురం జిల్లా: కంబదూరు మండల కేంద్రంలో మొహరం పండుగ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పాత కక్షలు నేపథ్యంలో పీర్ల గుడి వద్ద గొడవ మొదలైంది. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుంటూ కర్రలతో, కొడవలితో దాడులు చేసుకున్నారు.
అనంతపురం జిల్లా: కంబదూరు మండల కేంద్రంలో మొహరం (Muharram) పండుగ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పాత కక్షలు నేపథ్యంలో పీర్ల గుడి (Pirla Gudi) వద్ద గొడవ మొదలైంది. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుంటూ కర్రలతో, కొడవలితో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు.. వన్నూరు భాష, సాదిక్ భాషా, నూర్ భాషా, సుభాన్‌లుగా గుర్తించారు. క్షతగాత్రులను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ, సిఐ, ఎస్ఐల నేతృత్వంలో కంబదూరులో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
కాగా మతసామర్యానికి ప్రతీకగా నిలిచిన మొహరం పండుగను శనివారం జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారు జామున జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో పీర్లను ఊరేగించారు. అనంతరం సాయంత్రం పీర్ల చావిడిల వద్ద కుల మతాలకతీతంగా పీర్లను దర్శించు కుని మొక్కులు తీర్చుకున్నారు.
Updated Date - 2023-07-30T09:12:19+05:30 IST