Sathya Sai Dist.: ఇళ్ల పట్టాల కోసం పేదల నిరసనలు
ABN, First Publish Date - 2023-10-08T09:20:34+05:30
సత్యసాయి జిల్లా: చిలమత్తూరులో ఇళ్ల పట్టాల కోసం పేదల నిరసనలు కొనసాగుతున్నాయి. తాము వేసుకున్న గుడిసెలను తొలగించడాన్ని నిరసిస్తూ నిన్న (శనివారం) ఉదయం తహసీల్దార్ కార్యాలయం ముందు స్నానాలు చేసి.. వంటా వార్పు కార్యక్రమం చేపట్టిన పేదలు..
సత్యసాయి జిల్లా: చిలమత్తూరులో ఇళ్ల పట్టాల కోసం పేదల నిరసనలు కొనసాగుతున్నాయి. తాము వేసుకున్న గుడిసెలను తొలగించడాన్ని నిరసిస్తూ నిన్న (శనివారం) ఉదయం తహసీల్దార్ కార్యాలయం ముందు స్నానాలు చేసి.. వంటా వార్పు కార్యక్రమం చేపట్టిన పేదలు.. రాత్రి రెవెన్యూ కార్యాలయంలోనే నిద్రించారు.
చిలమత్తూరు మండలం, కోడూరు సమీపాన ఉన్న ప్రభుత్వ స్థలంలో సుమారు 150 కుటుంబాలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నాయి. అయితే నేషనల్ హైవేకు ఆనుకున్న ఉన్న ఆ స్థలం రిజర్వులో ఉందంటూ ఆ గుడిసెలను అధికారులు తొలగించారు. దీంతో వైసీపీ ప్రభుత్వం చర్యలను నిరసిస్తూ అదే స్థలంలో తమకు పట్టాలు ఇవ్వాలంటూ పేదలు నిరసనలు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలుమార్లు ప్రజా ప్రతినిధులు అధికారులను కలిసి తమ సమస్యల గురించి విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గుడిసెలను తొలగిస్తే 150 కుటుంబాలు ఏమైపోతాయంటూ పేదలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు తమ సమస్యకు పరిష్కారం చూపించకపోతే తాము ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Updated Date - 2023-10-08T09:20:34+05:30 IST