AP CM Jagan: సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్
ABN, First Publish Date - 2023-12-07T17:01:17+05:30
తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు శుభాకాంక్షలు జగన్ తెలిపారు.
తాడేపల్లి, గుంటూరు జిల్లా: తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సీఎం జగన్ అన్నారు.
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. కొన్ని గంటల ముందే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రేవంత్‌తో సహా 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం చేసిన నేపథ్యంలో వీటి అమలుపై కేబినెట్ సమావేశంలో మంత్రులతో సీఎం రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. పథకాల అమలు, ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశాలపై మంత్రివర్గంతో చర్చించనున్నారు.
Updated Date - 2023-12-07T17:28:03+05:30 IST