ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Government: ఏపీ ప్రభుత్వం మరోసారి అప్పు.. ఈసారి ఏకంగా..

ABN, First Publish Date - 2023-05-09T14:54:54+05:30

ఏపీ సర్కార్ అప్పుల మీద అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రజలపై పెను భారాన్ని మోపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ సర్కార్ (AP Government) అప్పుల మీద అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రజలపై పెను భారాన్ని మోపుతోంది. ఇప్పటికే ఎన్నో వేల కోట్ల అప్పులు చేసిన సర్కార్ ఈసారి దాదాపు మూడువేల కోట్ల మేర అప్పు తీసుకుంది. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలంలో సర్కార్ పాల్గొంది. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా 3 వేల 500 కోట్ల రూపాయలు అప్పును సర్కార్ తీసుకొచ్చింది. ఇందులో వెయ్యి కోట్ల రూపాయలు 6 సంవత్సరాలకు 7.34 శాతం, మరో వెయ్యి కోట్లు 20 సంవత్సరాలకు 7.37 శాతం వడ్డీతో అప్పు తీసుకుంది. అలాగే 500 కోట్లు 8 సంవత్సరాలకు 7.40 శాతం , మరో 500 కోట్లు 10 సంవత్సరాలకు 7.39 శాతం, ఇంకో 500 కోట్లు 15 సంవత్సరాలకు 7.38 శాతం వడ్డీతో ఏపీ ప్రభుత్వం అప్పు పొందింది. ఈ రోజు సాయంత్రానికి ఖజానాలో మొత్తం డబ్బు జమకానుంది. ఇందులో రిజర్వ్ బ్యాంక్ ఓడీని 1500 కోట్లు మినహాయించే అవకాశం ఉంది. మిగతా డబ్బుతో ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్ లకు పెన్షన్‌లు వస్తాయని ఉద్యోగులు ఆశిస్తున్న పరిస్థితి. తాజాగా తీసుకున్న అప్పుతో... గడిచిన 40 రోజుల్లో 9 వేల 500 కోట్ల రూపాయలు మేర ఏపీ ప్రభుత్వం అప్పు చేసినట్లైంది.

Updated Date - 2023-05-09T14:57:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising