AP Govt: ఖరీఫ్ సీజన్‌కు సాగునీరు విడుదల చేసిన ఏపీ సర్కార్
ABN, First Publish Date - 2023-06-07T09:45:51+05:30
ఖరీఫ్ సీజన్‌కు సాగునీటీ ఏపీ సర్కార్ విడుదల చేసింది. బుధవారం ఉదయం ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా ఈస్ట్రన్ హెడ్ రెగ్యులేటరీ ద్వారా కాలువలకు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు, మంత్రులు జోగి రమేష్, తానేటి వనిత, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కలెక్టర్ ఢిల్లీ రావు నీటిని విడుదల చేశారు.
విజయవాడ: ఖరీఫ్ సీజన్‌కు సాగునీటీ ఏపీ సర్కార్ (Ap Government) విడుదల చేసింది. బుధవారం ఉదయం ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా ఈస్ట్రన్ హెడ్ రెగ్యులేటరీ ద్వారా కాలువలకు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu), మంత్రులు జోగి రమేష్ (Jogi Ramesh), తానేటి వనిత (Taneti Vanitha), ఎమ్మెల్యే మల్లాది విష్ణు (MLA Malladi Vishnu), వెల్లంపల్లి శ్రీనివాసరావు (Vellampalli Srinivasrao), కలెక్టర్ ఢిల్లీ రావు (Collector Delhi Rao) నీటిని విడుదల చేశారు. ఈరోజు వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల కానుంది. డిమాండ్‌ను బట్టి మరింత పెంచే అవకాశం ఉంది. మంత్రి అంబటి రాంబాబు తొలుత శాస్త్రోక్తంగా పూజ చేసి, కొబ్బరి కాయ కొట్టారు. అనంతరం పూలు, పండ్లు, గాజులు, పసుపు, కుంకుమ, సారెను ప్రజాప్రతినిధులు, అధికారులు కాలువలోకి వదిలారు.
మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కృష్ణా, గుంటూరు జిల్లాల కాలువలకు నీరు విడుదల చేశామన్నారు. పూర్వం జూన్ నెలాఖరులో, జులై మొదటి వారంలో వదిలేవారని.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jaganmohan reddy) ఆదేశాలతో నెల ముందే నీరు ఇచ్చామని తెలిపారు. త్వరగా ఖరీఫ్ ప్రారంభం కావడం వల్ల మూడు పంటలు పండే అవకాశం ఉందన్నారు. ప్రకృతి విపత్తుల నుంచి కూడా రైతుకు ఇబ్బంది ఉండదన్నారు. సాగర్ నుంచి రాకుండానే పులిచింతలలో 34 టీఎంసీల నీరు ఉందని, అక్కడి నుంచే నీటిని రైతులకు అందిస్తున్నామని చెప్పారు. ఈ యేడాది పట్టిసీమ నుంచి నీరు తెచ్చే అవసరం ఉండదని అన్నారు. పులిచింతలలో 34 టీఎంసీల నీరు సరిపోతుందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక నీటి కొరత అనేదే లేదని తెలిపారు. వైఎస్, జగన్‌మోహన్ రెడ్డి పాలనలో సమృద్ధిగా వర్షాలు పడతాయని నిరూపణ అయ్యిందన్నారు. వర్షాల వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటే ముందస్తుగా చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణా వరదల నుంచి క్షేమంగా ఉండేలా ప్రజల కోసం రిటైనింగ్ వాల్ నిర్మాణం చేశారన్నారు. ప్రజల కోసం పూర్తి స్థాయిలో రక్షణ కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ కొనియాడారు.
మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. రైతుల మేలు కోసం నెల రోజుల ముందే నీరు విడుదల చేశామన్నారు. జగన్‌మోహన్ రెడ్డి పాలనలో దేవుడు కరుణించాడని అన్నారు. వరుణ దేవుడి కరుణ కటాక్షాలతో జలాశయాలు నిండుకుండలా ఉన్నాయని తెలిపారు. రైతులకు పంటలు పండి మంచి దిగుబడి వచ్చిందన్నారు. నాలుగేళ్లల్లో రైతుల నుంచి ధాన్యం కూడా కొనుగోలు చేశారన్నారు. వైఎస్ హయాంలో పులిచింతల శరవేగంగా పనులు చేశారని తెలిపారు. కృష్ణా డెల్టాకు నీటి కొరత లేకుండా ఇస్తున్నామన్నారు. పోలవరం వ్యయం పెంచి కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందేలా చేశారని, రూ.12,900కోట్ల నిధులు కేంద్రం నుంచి తెప్పించగలిగారని అన్నారు. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఏపీ అన్నపూర్ణగా పంటలతో కళకళలాడుతుందని అన్నారు. ఢిల్లీ వెళ్లి ఏం పీకారు అన్న వారు జగన్‌మోహన్ రెడ్డి ఏం చేశారో తెలుసుకోవాలని మంత్రి జోగి రమేష్ హితవుపలికారు.
Updated Date - 2023-06-07T09:45:51+05:30 IST