HighCourt: రాజధాని కార్యాలయాల తరలింపుపై హైకోర్ట్ సీరియస్ వ్యాఖ్యలు
ABN, Publish Date - Dec 20 , 2023 | 03:49 PM
Andhrapradesh: క్యాంప్ కార్యాలయం ముసుగులో రాజధాని కార్యాలయాల తరలింపుపై హైకోర్ట్ సీరియస్ వ్యాఖ్యలు చేసింది.
అమరావతి: క్యాంప్ కార్యాలయం ముసుగులో రాజధాని కార్యాలయాల తరలింపుపై హైకోర్ట్ (AP HighCourt) సీరియస్ వ్యాఖ్యలు చేసింది. తరలింపును సవాల్ చేస్తూ రైతులు వేసిన పిటీషన్‌పై బుధవారం హైకోర్ట్‌లో విచారణ జరిగింది. ఈ పిటీషన్‌ను ముగ్గురు సభ్యుల ధర్మాసనంకు పంపుతామని హైకోర్ట్ చెప్పింది. అక్కడ ఇప్పటికే విచారణ పెండింగ్‌లో ఉన్నాయని.. ఈ లోపు పిటీషన్ వేసిన రైతుల ఆందోళనను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని హైకోర్ట్ న్యాయమూర్తి తెలిపారు. రాజధాని కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధిస్తామని ధర్మాసనం చెప్పింది. దీంతో తాము ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. తదుపరి విచారణను హైకోర్టు రేపటి(గురువారం)కి వాయిదా వేసింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 20 , 2023 | 03:49 PM