ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ‘సీఎస్ పరిష్కరించకపోతే.. ఉద్యమం డోస్ పెంచుతాం’

ABN, First Publish Date - 2023-04-24T17:39:50+05:30

సచివాలయంలో సీఎస్ జవహర్‌రెడ్డి (CS Jawahar Reddy)ని ఏపీ జేఏసీ (AP JAC) అమరావతి కన్వీనర్ బొప్పరాజు వేంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu), ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సచివాలయంలో సీఎస్ జవహర్‌రెడ్డి (CS Jawahar Reddy)ని ఏపీ జేఏసీ (AP JAC) అమరావతి కన్వీనర్ బొప్పరాజు వేంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu), ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. సమస్యలతో కూడిన 50 పేజీల విజ్ఞప్తులు అందజేశారు. గత 47 రోజులుగా ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమాన్ని చేపడుతోందన్నారు. రేపు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపైన 29న గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ధర్నాలు చేపడతామని తెలిపారు. ఈ నెల 28న అన్ని ఉద్యోగ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలపై గతంలో సమావేశాలు పెట్టినా పరిష్కారం దిశగా నోచుకోవడం లేదన్నారు.

ఈ నెల 28 నుంచి కార్మిక, టీచర్స్, సంఘాలతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నామన్నారు. తాము చాలా ఓపికతో సహనంతో ఉద్యమాన్ని చేస్తున్నామన్నారు. తెలంగాణాలో ఒక్క డీఏ పెండింగ్‌లో లేదని, కానీ ఏపీ లో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డీఏ ఊసే లేదన్నారు. సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అంశాలపై సమస్యలు పెంచే కొద్ది పెరుగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. 50 పేజీల నివేదిక అంశాలను సీఎస్‌కు అందచేశామన్నారు. సీఎస్ వాటిని తప్పకుండా పరిష్కారం చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Updated Date - 2023-04-24T17:39:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising