Janasena: బంగారం వ్యవహారంపై అంబటిపై గాదె సంచలన కామెంట్స్
ABN, First Publish Date - 2023-02-13T16:29:42+05:30
సత్తెనపల్లి నియోజకవర్గం వివాదాలమయమైందని జనసేన (Janasena) జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు (Gade Venkateswara Rao) అన్నారు. రైతులకు బంగారం ఇవ్వకుండా...
గుంటూరు: సత్తెనపల్లి నియోజకవర్గం వివాదాలమయమైందని జనసేన (Janasena) జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు (Gade Venkateswara Rao) అన్నారు. రైతులకు బంగారం ఇవ్వకుండా... బ్యాంక్ సిబ్బంది జాప్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు. అప్రెయిజర్ సంపత్ మంత్రి అంబటి అనుచరుడన్నారు. బంగారం మాయంపై మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పందించాలని డిమాండ్ చేశారు. బంగారం మాయం వెనుక మంత్రి అంబటి హస్తం ఉందని గాదె ఆరోపించారు. రైతులకు అన్యాయం జరిగితే మంత్రి ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు.
ఇదిలావుండగా... వైజాగ్ (vizag)లో ఉద్రిక్తతలు సృష్టించారని.. రాష్ట్రాన్ని నాశనం చేయాలని చేస్తున్నారని గాదె వెంకటేశ్వరావు విమర్శించారు. ఒకటో, రెండో, మూడో కృష్ణుడు లాగా ఒకరి తర్వాత మరొకరు మీడియా ముందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. అంబటి (Ambati), అమర్ (Amar), కొట్టు, బొత్సలు ఒకరి తర్వాత మరొకరు ప్రెస్ మీట్లు పెట్టారని గాదె పేర్కొన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారని ప్రశ్నించారు. 151 మందిలో మొలతాడు కట్టిన మగాళ్ళు నలుగురేనా? అని ఎద్దేవా చేశారు. జగన్ వద్ద బానిసత్వం చేస్తుంది ఈ నలుగురేనా ..? అని ప్రశ్నించారు. మగాళ్ళుగా బతకలేరని.. కనీసం రాజకీయ నాయకులుగా అయినా బతకాలని హితవు పలికారు. వైవి సుబ్బారెడ్డి, జోగి రమేష్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారా...? అని గాదె వెంకటేశ్వరరావు ప్రశ్నించారు.
Updated Date - 2023-02-13T16:29:46+05:30 IST