ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘అక్కను వేధిస్తున్నాడని తమ్ముడు ధైర్యంగా ఎదురుతిరిగితే ఇక బలైపోవాలా?’

ABN, First Publish Date - 2023-06-19T21:17:54+05:30

ప్రభుత్వ వైఫల్యంతోనే అమర్నాథ్ హత్యకు గురయ్యాడని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ (MLA Anagani Satya Prasad) ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రభుత్వ వైఫల్యంతోనే అమర్నాథ్ హత్యకు గురయ్యాడని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ (MLA Anagani Satya Prasad) ఆరోపించారు. అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించిన బాలుడిని కక్షపూరితంగా దారికాచి తగలపెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. మహిళల్ని వేధిస్తున్నారని ఎన్నో ఫిర్యాదులు అందినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే అరాచకాలు పెరిగాయన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో మరే కుటుంబానికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటారని చెప్పారు. అమర్నాథ్ సోదరికి జరిగిన ఘటనే తన కూతురికి జరిగితే ముఖ్యమంత్రి ఇలాగే స్పందిస్తాడా?, అక్కను వేధిస్తున్నాడని తమ్ముడు ధైర్యంగా ఎదురుతిరిగితే ఇక బలైపోవాలా?, రావణ కాష్టంలా తయారవుతున్న రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదా? అని ఆయన ప్రశ్నించారు. తాము కూడా మనుషులమేనని వైసీపీ నేతలు గ్రహించాలని సూచించారు. ట్యూషన్ కి వెళ్తున్న అమర్నాథ్‌ని ఉదయం 5 గంటలకు అతి కిరాతకంగా సజీవదహనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాపాయంతో అమర్నాథ్ కొట్టుమిట్టాడుతుంటే పోలీసులు వ్యవహరించిన తీరు బాగోలేదన్నారు. ముఖ్యమంత్రి కనీసం సందించకపోతే నేరస్థులు ఎంతకైనా పెట్రేగిపోతారని పేర్కొన్నారు. భర్త ముందే భార్యని వేధించినానోరెత్తకూడదనే పరిస్థితి తీసుకొస్తారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కూడా ఆడబిడ్డలు ఉన్నారని గుర్తించాలని ఆయన సూచించారు. సీఎం ఇంటి సమీపంలో సామూహిక అత్యాచారం జరిగినా జగన్మోహన్ రెడ్డి స్పందించడా? అని ప్రశ్నించారు.

Updated Date - 2023-06-19T21:17:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising