TDP: రాబోయేది క్లాస్ వార్ కాదు క్యాష్ వార్: యనమల
ABN, First Publish Date - 2023-05-27T22:13:01+05:30
రాబోయేది క్లాస్ వార్ కాదు క్యాష్ వార్ అని టీడీపీ (TDP) పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) అన్నారు.
రాజమండ్రి: రాబోయేది క్లాస్ వార్ కాదు క్యాష్ వార్ అని టీడీపీ (TDP) పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) అన్నారు. ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు.. పేదలు మరింత దిగజారుతున్నారు. అసమానతలు తొలిగేలా చేయడమే మన రాజకీయ తీర్మానం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. మార్పు టీడీపీతోనే సాధ్యమన్నారు. గతంలో ఎన్టీఆర్ (NTR) వల్లే మార్పు వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు పేదల జీవితాల్లో మార్పు తెచ్చేది చంద్రబాబే (Chandrababu) అని పేర్కొన్నారు. రాజకీయ పార్టీగా ఉన్న టీడీపీ రాజకీయానికే పరిమితం కాదని.. ప్రజలకు సేవ చేయడమే మన రాజకీయమన్నారు.
టీడీపీ ఎప్పుడూ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేదన్నారు. ప్రధానులను టీడీపీ నిర్ణయించిందన్నారు. దేశ రాజకీయాల్లో ఎన్నో మార్పులు తెచ్చింది టీడీపీనే అని పేర్కొన్నారు. క్యాష్ వార్‌లో గెలిచి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, దీనికి రాజమండ్రి వేదిక అయిందన్నారు. జగన్ (CM Jagan) దగ్గర బ్లాక్ మనీ విపరీతంగా ఉందని ఆరోపించారు. ఇడుపులపాయలోని బంకర్లల్లో బ్లాక్ మనీ ఉందన్నారు. జగన్ దగ్గరున్న బ్లాక్ మనీ పోతే ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయన్నారు. ఎన్నికల్లో క్యాష్ ప్రభావం ఉంటే పేదలకు ఇబ్బందని చెప్పారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామన్నారు. సరైన సనయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
Updated Date - 2023-05-27T22:13:01+05:30 IST