ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ‘అక్కడ కాపురం పెట్టమని జగన్‌కు ఆ ఇద్దరిలో ఎవరు చెప్పారో..?’

ABN, First Publish Date - 2023-04-19T15:35:50+05:30

మూడు రాజధానులంటే మూడు చోట్ల కాపురం పెట్టడమా జగన్ రెడ్డీ?, విశాఖలో కాపురం పెట్టమని జగన్‌కు పొలిటికల్ లాబీయిస్ట్ విజయ్ కుమార్ చెప్పాడా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మూడు రాజధానులంటే మూడు చోట్ల కాపురం పెట్టడమా జగన్ రెడ్డీ?, విశాఖలో కాపురం పెట్టమని జగన్‌కు పొలిటికల్ లాబీయిస్ట్ విజయ్ కుమార్ చెప్పాడా? లేక స్వరూపానంద చెప్పాడా? అని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (MLC Panchumarthi Anuradha) ప్రశ్నించారు. రాలయసీమలో కాపురం పెట్టి ఇడుపులడలపాయలో అసైన్డ్ భూములు కొట్టేశారని మండిపడ్డారు. అమరావతిలో కాపురం పెట్టి రాజధాని రైతులను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ వెళ్ళకుండానే రూ. 40 వేల కోట్ల విలువైన భూములు కబ్జా చేసి, ఋషికొండను బోడిగుండు చేసేసి రేపు సెప్టెంబర్‌లో కాపురానికి వెళతారా?, వికేంద్రీకరణ అంటే ఇదేనా జగన్ రెడ్డీ?, ఒక హత్య-లక్ష అబద్ధాలతో కాలం గడపడం మినహా ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి జగన్ రెడ్డి చేసిందేంటి? అని ఆమె ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో జగన్ అండ్ కో నటన ఆస్కార్‌ను మించిపోయిందని విమర్శించారు. ఒక కన్ను మరో కన్నును పొడుచుకుంటుందా అంటూ అసెంబ్లీలో నంగనాచి కబుర్లు చెప్పిన సీఎం జగన్ ఎందుకు భయపడున్నారు? అని ఆమె ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్య కేసులో అన్ని వేళ్లూ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయన్నారు. పిన్నమ్మ తాళి తెంచిన జగన్ రెడ్డి ఏపీ ప్రజలకు న్యాయం చేస్తాడా?, హత్యతో సంబంధం లేదన్న ఎంపీ అవినాష్ రెడ్డి రక్తపు మడుగులు ఎందుకు తుడిచినట్టు? అని ప్రశ్నించారు.

Updated Date - 2023-04-19T15:35:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising