ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: దళిత బాలికపై హత్యాచారం ఘటనలో కీలక పరిణామం.. జిల్లా ఎస్పీకి కీలక ఆదేశం

ABN, First Publish Date - 2023-07-24T17:39:58+05:30

నాలుగు రోజుల క్రితం అదృశ్యమై.. ఆదివారం అనుమానాస్పద స్థితిలో శవమై తేలిన దళిత బాలిక ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నట్టు ఏపీ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీకి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై వార్తా పత్రికలలో వెలువడిన కథనాలను సుమోటోగా స్వీకరించినట్టు ఆమె తెలిపారు.

అమరావతి/పామర్రు: నాలుగు రోజుల క్రితం అదృశ్యమై.. ఆదివారం అనుమానాస్పద స్థితిలో శవమై తేలిన దళిత బాలిక ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నట్టు ఏపీ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీకి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై వార్తా పత్రికలలో వెలువడిన కథనాలను సుమోటోగా స్వీకరించినట్టు ఆమె తెలిపారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేట్టాలని కోరారు. లోకేష్, నరేంద్ర అనే ఇద్దరు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా సమగ్ర దర్యాప్తు జరిపి.. తీసుకున్న చర్యలకు సంబంధించి రిపోర్ట్ అందజేయాలని ఎస్పీని కోరారు. ఈ సందర్భంగా కేసు విచారణా వివరాలను ఎస్పీ వివరించారు. సీసీ ఫుటేజ్ వివరాలను వెల్లడించారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని, 15 రోజులలో చార్జ్‌షీట్ కూడా దాఖలు చేస్తామని వాసిరెడ్డి పద్మకు ఎస్పీ తెలిపారు. కాగా... నిందితులకు కరిన శిక్ష పడే వరకు విచారణ వేగవంతంగా పూర్తిచేయాలని వాసిరెడ్డి పద్మ కోరారు.

అసలేం జరిగిందంటే...

పామర్రు మండలం నిభానుపూడి గ్రామానికి చెందిన దళిత బాలిక నిమ్మకూరు జెడ్పీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుకునేది. కొండిపర్రుకు చెందిన యువకుడు లోకేశ్‌ కొంతకాలంగా ప్రేమ పేరుతో చాటింగ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈనెల 20న స్కూల్‌కు బయలుదేరిన బాలిక స్కూల్‌కు వెళ్లకుండా నిందితుడి బైక్‌పై వెళ్లింది. నిందితుడు బాలికను ఉయ్యూరు రామచంద్ర లాడ్జికి తీసుకెళ్లాడు. లోకేశ్‌, అతనికి సోదరుడి వరుసయ్యే నరేంద్ర కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత బాలికను 21న గ్రామ సమీపంలో వదిలి పరారయ్యారు. అప్పటికే బాలిక కోసం ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో ఆమె తల్లి 21న పామర్రు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ శ్రీకాంత్‌ పర్యవేక్షణలో పామర్రు సీఐ వెంకట నారాయణ, ఎస్సై వెంకట ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి ప్రత్యేక బృందాలతో కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలిక కోసం ముమ్మరంగా గాలించారు. మొవ్వ మండలంలోని మంత్రిపాలెం సమీపంలోని సూరసానిపల్లి వద్ద పంటకాల్వలో ఆదివారం సాయంత్రం బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిందితులపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Updated Date - 2023-07-24T17:42:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising