Venkatramireddy: ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూల స్పందన....
ABN, First Publish Date - 2023-09-07T15:26:53+05:30
ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఏపీజీఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు.
అమరావతి: ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఏపీజీఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. 2014 జూన్ నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తూ ఇప్పటికీ కొనసాగుతున్న ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయటం కోసం ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్ సంతకం కోసం ప్రభుత్వం పంపిందన్నారు. వచ్చే వారంలో గత క్యాబినెట్ నిర్ణయం మేరకూ రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు రాబోతున్నాయని తెలిపారు. జీపీఎస్ సమస్యపై కూడా అతి త్వరలో సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నామన్నారు. ఉద్యోగులకు సంబంధించిన డీఏ బకాయిలను సెప్టెంబర్ నెలాఖరుకు విడుదల చేస్తారని ఆశిస్తున్నామన్నారు. 2004 సెప్టెంబరు 1కి ముందు వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగాల్లో చేరిన వారందరకీ పాత పెన్షన్ విధానంలోకి తీసుకు వెళ్లాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.
Updated Date - 2023-09-07T15:26:53+05:30 IST