ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MP Avinash Reddy : అవినాష్ కుటుంబంలో అరెస్ట్‌ల టెన్షన్..

ABN, First Publish Date - 2023-03-11T11:33:47+05:30

పులివెందులలో వైఎస్ వివేకా హత్య కేసు టెన్షన్ కొనసాగుతోంది. రేపు కడపలో సీబీఐ ఎదుట వైఎస్ భాస్కర్ రెడ్డి విచారణకు హాజరుకానున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కడప : పులివెందులలో వైఎస్ వివేకా హత్య కేసు టెన్షన్ కొనసాగుతోంది. రేపు కడపలో సీబీఐ ఎదుట వైఎస్ భాస్కర్ రెడ్డి విచారణకు హాజరుకానున్నారు. అయితే భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున ఎంపీ అవినాష్ కుటుంబంతో పాటు వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలు నిందితులేనని.. అరెస్ట్‌లు తప్పవని హైకోర్టుకు సీబీఐ తేల్చిచెప్పింది. ఈ క్రమంలోనే అవినాష్ కుటుంబాన్ని అరెస్ట్‌ల టెన్షన్ పట్టి పీడిస్తోంది.

‘‘వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్‌ రెడ్డి !, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి ఇద్దరూ నిందితులే. వారిని అరెస్ట్‌ చేయాలని గత నెల 24న అవినాశ్‌ రెడ్డి విచారణ సందర్భంగానే నిర్ణయించాం. వారిని అరెస్టు చేస్తాం’’ అని సీబీఐ కుండబద్దలు కొట్టింది. తెలంగాణ హైకోర్టుకు ఈ విషయం సూటిగా చెప్పింది. అంతేకాదు... శుక్రవారం మూడోసారి విచారణకు హాజరైన అవినాశ్‌ రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ‘ఆ విచారణ పూర్తయ్యేలోపు ఏ క్షణమైనా అరెస్టు చేస్తాం’ అని సీబీఐ న్యాయవాదులు హైకోర్టుకు కూడా చెప్పారు. కానీ... ‘సోమవారం దాకా ఆగండి’ అని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలతో అరెస్టు నుంచి అవినాశ్‌ రెడ్డి త్రుటిలో తప్పించుకున్నట్లయింది.

Updated Date - 2023-03-11T11:50:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising