ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Avinash Reddy : ఇంటి నుంచి సీబీఐ కార్యాలయానికి బయలుదేరిన అవినాశ్ రెడ్డి

ABN, First Publish Date - 2023-06-03T09:39:13+05:30

వైఎస్ వివేకా హత్య కేసులో నేడు ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారించనుంది. ఈ క్రమంలోనే ఆయన తన నివాసం నుంచి సీబీఐ కార్యాలయానికి బయలుదేరారు. ఇప్పటికే అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందుస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ప్రతి శనివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 వరకూ ఆయనను విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Murder Case)లో నేడు ఎంపీ అవినాశ్ రెడ్డి(YS Avinash Reddy)ని సీబీఐ విచారించనుంది. ఈ క్రమంలోనే ఆయన తన నివాసం నుంచి సీబీఐ కార్యాలయానికి బయలుదేరారు. ఇప్పటికే అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ముందుస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ప్రతి శనివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 వరకూ ఆయనను విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు నేడు సీబీఐ ముందు అవినాశ్ హాజరు కానున్నారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సూత్రధారిగా సీబీఐ అభియోగాలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు మే 31, 2023న తీర్పు వెలువరించింది. అవినాశ్‌ తల్లి అనారోగ్యం దృష్ట్యా ఇటీవల తెలంగాణ హైకోర్టు మే 31 వరకూ అవినాశ్‌ను అరెస్ట్ చేయొద్దని సీబీఐని గతంలో ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా ముందస్తు బెయిల్ రూపంలో అవినాశ్‌కు భారీ ఊరట లభించింది.

Updated Date - 2023-06-03T09:39:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising