ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bhaskar Reddy : అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరు పరిచే సమయంలో...

ABN, First Publish Date - 2023-04-19T09:23:46+05:30

చంచల్‌గూడ జైలులో ఉన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నేటి ఉదయం 9 గంటల నుంచి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ ఇద్దరినీ వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారించాల్సి ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad : చంచల్‌గూడ జైలులో ఉన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నేటి ఉదయం 9 గంటల నుంచి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ ఇద్దరినీ వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారించాల్సి ఉంది. ఈ క్రమంలోనే భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురి కావడంతో కలకలం రేగింది. అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరు పరిచే సమయంలో కూడా బీపీ పెరిగింది. భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురి కావడంతో సీబీఐ అధికారుల్లో ఆయనను విచారించే విషయంపై సందిగ్ధత చోటు చేసుకుంది.

మాజీ మంత్రి వివేకానందరెడ్డి (Former Minister Vivekananda Reddy) హత్యకేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డి తండ్రి, వైఎస్‌ భారతి మేనమామ వైఎస్ భాస్కర్‌రెడ్డి (YS Bhaskar Reddy)ని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. వివేకా హత్యకేసులో భాస్కర్‌రెడ్డి ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే పులివెందుల (Pulivendula)లో భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital)కి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి సీబీఐ జడ్జి ఎదుట హాజరుపర్చాలని అధికారులు భావించారు. అయితే ఉన్నఫలంగా భాస్కర్రెడ్డికి బ్లడ్ ప్రెషర్ (Blood pressure) పెరిగింది. బీపీ 170 ఉండడంతో సెలైన్ ఎక్కించి ఉస్మానియా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అలాగే 2D ఎకో పరీక్ష చేస్తున్నారు.

వివేకా హత్యకేసులో కుట్రదారుడిగా భాస్కర్‌రెడ్డిపై సీబీఐ అభియోగాలు మోపింది. వివేకా గుండెపోటుతో మరణించినట్లు మొదట ప్రచారం చేశారు. గుండెపోటుగా ప్రచారంలో భాస్కర్‌రెడ్డి పాత్ర ఉన్నట్లు సీబీఐ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాక్ష్యాలు చెరిపేయడంలో ఆయన పాత్ర ఉందని సీబీఐ చెబుతోంది. వివేకా హత్య ముందు భాస్కర్‌రెడ్డి ఇంట్లో సునీల్‌ ఉన్నట్లు గూగుల్‌ టేకౌట్‌ ద్వారా గుర్తించామని సీబీఐ అధికారులు చెబుతున్నారు. వివేకా కేసులో భాస్కర్ రెడ్డిని ఈ రోజు తెల్లవారుజామున ముఖేష్ శర్మ నేతృత్వంలోని సీబీఐ బృందం అరెస్ట్ చేసింది. ఉదయం 6.10 నుంచి భాస్కర్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత భాస్కర్‌రెడ్డి ఇంట్లోకి ఎవర్నీ సీబీఐ అనుమతించలేదు. అయితే కీలక ఆధారాలు సేకరించినట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి.

Updated Date - 2023-04-19T09:23:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising