ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: ప్రేమ వేధింపులు తాళలేక అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం.. ఇంతకీ ఏం జరిగిందంటే?

ABN, First Publish Date - 2023-08-05T12:14:52+05:30

అమ్మాయి వ్యక్తిత్వం నచ్చకపోవడంతో దూరంగా పెట్టగా.. చివరకు ఆ యువతి చేసిన నిర్వాకానికి ఇద్దరు అన్నదమ్ములు తీవ్ర మనోవేదనకు గురై.. ఇక మాకీ బ్రతుకే వద్దన్న పరిస్థితికి తీసుకువచ్చిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.

విస్సన్నపేట: అమ్మాయి వ్యక్తిత్వం నచ్చకపోవడంతో దూరంగా పెట్టగా.. చివరకు ఆ యువతి చేసిన నిర్వాకానికి ఇద్దరు అన్నదమ్ములు తీవ్ర మనోవేదనకు గురై.. ఇక మాకీ బ్రతుకే వద్దన్న పరిస్థితికి తీసుకువచ్చిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ప్రేమ వేధింపులు తాళలేక ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విస్సన్నపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. విస్సన్నపేటకు చెందిన ప్రేల మనోహర్ ములకలపాటి వారి గూడెం గ్రామానికి చెందిన గురజాల ప్రియాంకతో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పాడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. అయితే ప్రియాంక వ్యక్తిత్వం నచ్చకపోవడంతో మనోహర్ ఆమెను దూరం పెట్టాడు. దీంతో మనోహర్‌పై ప్రియాంక కేసు పెట్టగా.. కొంతకాలం మనోహర్ శిక్ష కూడా అనుభవించాడు. అనంతరం మనోహర్ ప్రియాంకకు దూరంగా వేరే ప్రాంతంలో జీవనం సాగిస్తున్నాడు.

అయితే మనోహర్ అన్న నరేష్‌పై కూడా ప్రియాంక విసన్నపేట పోలీసు స్టేషన్‌లో మరోసారి కేసు నమోదు చేసింది. అన్నదమ్ములపై ప్రియాంక వేధింపులు రోజురోజుకు ఎక్కువ అవ్వటంతో ఆ బాధలు తట్టుకోలేక నరేష్, మనోహర్ విసన్నపేటలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆపస్మారకస్థితిలోకి వెళ్లిన ఇద్దరినీ మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తమ పిల్లలు ఆత్మహత్య చేసుకోవటంతో తల్లి, మేనమామ తీవ్ర మనస్థాపనికి గురయ్యారు. విషయం తెలిసిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-08-05T12:14:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising