వరద నీటిలో చిక్కుకుపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఉప్పొంగుతున్న గోదావరి
ABN, First Publish Date - 2023-07-24T08:00:35+05:30
చింతూరు మండలం కుయిగూరు వద్ద వరదలో బస్సు చిక్కుకుపోయింది. ఒడిషా నుంచి ఏపీకి ప్రయాణీకులతో ప్రయివేటు ట్రావెల్ బస్సు వస్తోంది. కుయిగూరు వాగు వంతెనపై వరద నీరు ఉన్నా దాటించేందుకు డ్రైవర్ ప్రయత్నం చేస్తున్నారు.
అల్లూరి జిల్లా: చింతూరు మండలం కుయిగూరు వద్ద వరదలో బస్సు చిక్కుకుపోయింది. ఒడిషా నుంచి ఏపీకి ప్రయాణీకులతో ప్రయివేటు ట్రావెల్ బస్సు వస్తోంది. కుయిగూరు వాగు వంతెనపై వరద నీరు ఉన్నా దాటించేందుకు డ్రైవర్ ప్రయత్నం చేస్తున్నారు. వరద నీటి మధ్యలో బస్సు నిలిచిపోయింది. సకాలంలో బస్ నుంచి దిగి ప్రయాణికులు బయటపడ్డారు. ప్రొక్లెయినర్ సహాయంతో బస్సును అధికారులు బయటకు తీయించారు.
కాగా.. విలీన మండలాల్లో శబరి, గోదావరి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. చింతూరు మండలంలో చీకటి వాగు, సోకులేరు, కుయిగురు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కూనవరం మండలం కొండరాజుపేట కాజ్ వే పైకి వరద నీరు చేరుకుంది. దీంతో15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు నాటుపడవలు ఏర్పాటు చేయకపోవటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీఆర్ పురం మండలం అన్నవరం వాగు ఉధృతికి కాజ్ వేకు గండి పడింది.
Updated Date - 2023-07-24T08:00:35+05:30 IST