ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

LokeshPadayatra: లోకేశ్‌పై కేసు

ABN, First Publish Date - 2023-02-04T20:56:06+05:30

నిబంధనల ఉల్లంఘన, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ (Lokesh)తో పాటు మాజీ మంత్రి అమరనాథరెడ్డి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంగారుపాళ్యం: నిబంధనల ఉల్లంఘన, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ (Lokesh)తో పాటు మాజీ మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి (MLC Deepak Reddy), టీడీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంగారుపాళ్యం నాలుగు రోడ్ల కూడలి వద్దకు శుక్రవారం సాయంత్రం పాదయాత్ర చేరుకోగా బహిరంగ సభకు అనుమతులు లేవంటూ పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి అభ్యంతరం చెప్పారు. తాము పాదయాత్రగానే వచ్చామని సభ నిర్వహించలేదని చెప్పినా పట్టించుకోలేదు. పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదంతో రెండు గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేలాదిగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ఓ ఇంటి బాల్కనీ నుంచి లోకేశ్‌ మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు సౌండ్‌ సిస్టం వాహనాలు, లైవ్‌ వీడియో వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి బంగారుపాళ్యం ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి ఫిర్యాదు మేరకు 353, 188, 341 రెడ్‌విత్‌ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో అమరనాథరెడ్డి ఏ-1గా, పులివర్తి నాని ఏ-2గా, నారా లోకేశ్‌ ఏ-3గా, దీపక్‌రెడ్డి ఏ-4గా చూపారు. అనుమతి లేకుండా వాడుతున్న సౌండ్‌ సిస్టం వాహనాలను సీజ్‌ చేసేందుకు వెళ్లిన పోలీసుల విధులకు ఆటంకం కల్పించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

స్థానిక నేతలపై హత్యాయత్నం కేసు

బంగారుపాళ్యం (Bangarupalyam)లో శుక్రవారం సాయంత్రం సీజ్‌ చేసిన వాహనాలను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన తమపై టీడీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారన్న పలమనేరు రూరల్‌ సీఐ అశోక్‌కుమార్‌ ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. విధి నిర్వహణలో ఉన్న తమను చంపాలన్న ఉద్దేశ్యంతో టీడీపీ నేతలు జయప్రకాష్‌, జగదీష్‌, కొదండయాదవ్‌, మరి కొందరు కలిసి కర్రలు, రాళ్లతో దాడి చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో కొంత మంది పొలీసులకు గాయాలయ్యాయని తెలిపారు. ఈ మేరకు సెక్షన్‌ 332, 307, 143, 341, 149 కింద కేసు నమోదైంది.

Updated Date - 2023-02-04T20:56:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising