CBI: వివేకా హత్య కేసులో వాట్సాప్ కాల్స్‌పై అవినాశ్‌రెడ్డిని సుదీర్ఘంగా విచారించిన సీబీఐ
ABN, First Publish Date - 2023-06-03T17:41:13+05:30
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (Viveka murder case) కడప వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి (Avinash Reddy) సీబీఐ (CBI) విచారణ ముగిసింది.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (Viveka murder case) కడప వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి (Avinash Reddy) సీబీఐ (CBI) విచారణ ముగిసింది. వివేకా హత్య కేసులో అవినాశ్‌ను సీబీఐ అధికారులు 7 గంటల పాటు ప్రశ్నించారు. వివేకా హత్య రోజు వాట్సాప్ కాల్స్‌పై సీబీఐ సుదీర్ఘంగా విచారించింది. అవినాశ్‌రెడ్డి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ప్రతి శనివారం సీబీఐ ఎదుట హాజరు కావాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు సీబీఐ ఎదుట ఎంపీ అవినాశ్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంగా ఈ రోజు విచారణలో భాగంగా వివేకానందరెడ్డిని హత్య చేసిన అర్థరాత్రి సమయంలో వాట్సాప్ యాక్టివ్‌గా ఉందన్న అంశాన్ని కౌంటర్ అఫిడవిట్‌లో సీబీఐ అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. అదే అంశాలపైన ఈ రోజు అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఉదయం 10 గంటలకు విచారణ ప్రారంభం అయినప్పటి నుంచి అవినాశ్ వ్యక్తిగత మొబైల్‌ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ రోజు జరిగిన వాట్సాప్ కాల్స్, వాట్సాప్ ఛాటింగ్ సంబంధించిన అంశాలపైన పూర్తి స్థాయిలో సీబీఐ అధికారులు ఆరా తీశారు.
గతంలో సీబీఐ చెప్పిన ప్రకారం 6 అంశాలకు సంబంధించి అవినాశ్ రెడ్డి నుంచి క్లారిటీ రావాలన్న దానిపై ఈ రోజు ప్రశ్నించారు. ఇంకా సమాచారం రావాలని భావించిన సీబీఐ వచ్చే శనివారం కూడా ఇదే స్థాయిలోనే విచారణ జరిపే అవకాశం ఉంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ చేసి స్టేట్ మెంట్ రికార్డు చేసే అవకాశం ఉంది. వివేకానందరెడ్డిని హత్య చేసిన సమయంలో వాడిన ఆయుధాల గురించి ఆచూకీ లేదని, సునీల్‌యాదవ్ ఆయుధాన్ని దాటిపెట్టాడన్న అభియోగాలు ఉన్నాయని, ఆయుధం ఎక్కడ దాచిపెట్టారన్న అంశం అవినాశ్ రెడ్డి నాలెడ్జిలో ఉందనేది ప్రధానంగా సీబీఐ కూడా భావిస్తోంది. ఆ ఆయుధానికి సంబంధించి గతంలో కూడా విచారణ జరిగింది. ఇప్పుడు కూడా మరోసారి అవినాశ్ రెడ్డి నుంచి సమాచారాన్ని రాబట్టేందుకు సీబీఐ ప్రయత్నం చేసింది. ఇక ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డికి వాట్సాప్ కాల్ చేశాడనే అంశానికి సంబంధించి కూడా సీబీఐ ప్రశ్నించింది.
వివేకానందరెడ్డి మరణానికి సంబంధించి జగన్‌కు ఎవరి ద్వారా ముందు తెలిసింది అనే అంశంపై సీబీఐ ప్రశ్నించినప్పుడు అవినాశ్ రెడ్డి తాను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, తర్వాత సమాచారం ఇచ్చానని చెప్పినప్పటికీ కూడా 6.15 నిమిషాలకు బయటకు వస్తే.. 6.15 నిమిషాలకు ముందే అవినాశ్ రెడ్డి ఈ విషయం తెలిసిన తర్వాత జగన్‌కు తెలియజేశాడనేది ప్రధానమైన అభియోగం. ఆ అభియోగానికి సంబంధించే దాదాపు 3 నుంచి 4 గంటల పాటు వాట్సాప్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో రిట్రైవ్ చేయడం కానీ, సీబీఐ సేకరించిన టెక్నికల్ ఆధారాలతో అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఇంకా విచారణ చేయాల్సి ఉందని, విచారణలో కీలక విషయాలు బయటపడాల్సి ఉందని, మరో శనివారం విచారణకు వచ్చినప్పుడు అవినాష్ రెడ్డిని పూర్తి స్థాయిలో సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. లేదా కీలకమైన సమాచారాన్ని రాబట్టాలని సీబీఐ భావిస్తే మరోసారి నోటీసు జారీ చేసి ఈ వారంలోనే విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇందులో ఉమాశంకర్ రెడ్డి సోదరుడైన జగదీశ్వర్ రెడ్డి కూడా ఈరోజు విచారణకు హాజరయ్యారు. జగదీశ్వర్ రెడ్డి రోల్‌కు సంబంధంచి కొంత అనుమానం ఉండంతో వివేకా ఆస్తులకు సంబంధించి, భూ వ్యవహారంలో జగదీశ్వర్ రెడ్డికి, ఉమాశంకర్ రెడ్డికి, వివేకాకు మధ్య కొంత వివాదం ఉందనే అంశం కూడా బయటపడుతోంది. ఆ వివాదానికి సంబంధించి కూడా జగదీశ్వర్ రెడ్డిని విచారణ జరిపి సీబీఐ స్టేట్ మెంట్ రికార్డు చేసింది. జగదీశ్వర్ రెడ్డిని సీబీఐ 2 గంటలు మాత్రమే విచారించి పంపించారు.
Updated Date - 2023-06-03T19:04:38+05:30 IST