ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viveka Case: ఏడు గంటల పాటు అవినాశ్‌ను ప్రశ్నించిన సీబీఐ.. రూ.4 కోట్ల ఫండింగ్పై ఆరా

ABN, First Publish Date - 2023-06-10T17:40:00+05:30

మాజీమంత్రి వివేకానందరెడ్డి (Former Minister Vivekananda Reddy) హత్య కేసులో ఎంపీ అవినాశ్‌‌రెడ్డి (MP Avinash Reddy) సీబీఐ విచారణ ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మాజీమంత్రి వివేకానందరెడ్డి (Former Minister Vivekananda Reddy) హత్య కేసులో ఎంపీ అవినాశ్‌‌రెడ్డి (MP Avinash Reddy) సీబీఐ విచారణ ముగిసింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవినాశ్‌రెడ్డిని అధికారులు విచారించారు. 7 గంటల పాటు విచారించిన సీబీఐ స్టేట్‌మెంట్ రికార్డ్ (CBI statement record) చేసింది. ఏడు గంటల విచారణలో పలు అంశాలపై సీబీఐ ఆరా తీసింది. వాట్సప్ కాల్స్, రూ.4 కోట్ల ఫండింగ్పై సీబీఐ అధికారులు ఆరా తీశారు. అలాగే అప్రూవర్ దస్తగిరిని ప్రలోభాలకు గురిచేయడంపై అవినాశ్‌ను సూటిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వివేకా హత్య కేసులో అవినాశ్ ఏ8 నిందితుడిగా ఉన్నారు. ఇదే కేసులో అవినాశ్‌‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ప్రతీ శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయింత్రం 5 గంటలకు సీబీఐ విచారణకు హాజరుకావాలని అవినాశ్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో ఆయన సీబీఐ విచారణకు హాజరయ్యారు.

అవినాశ్ ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టుకు సునీత

అవినాశ్‌రెడ్డి ముందుస్తు బెయిల్ కొట్టివేయాలంటూ వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి (Sunitha Reddy) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన ధర్మాసనం మంగళవారం (జూన్ 13) విచారణ జరుగనుంది. శుక్రవారం జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట ఆమె తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ప్రస్తావించారు. ఏప్రిల్‌ 24న ముందస్తు బెయిల్‌పై తిరిగి విచారించాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించిందని, వేసవి సెలవుల కారణంగా విచారణ జరుపలేదని.. దాంతో హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారించాలని సుప్రీం సూచించిందని ఆయన గుర్తుచేశారు.

భాస్కర్‌రెడ్డికి బెయిలివ్వడానికి కోర్టు ససేమిరా

వివేకా హత్య కేసులో ఏ-7గా ఉన్న వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ సీబీఐ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 6న తీర్పు రిజర్వు చేసిన న్యాయస్థానం.. బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఆదేశాలిచ్చింది. భాస్కర్‌రెడ్డి తరఫున న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు వాదనలు వినిపించారు. పిటిషనర్‌కు వ్యతిరేకంగా అప్రూవర్‌గా మారిన ఏ-4 దస్తగిరి స్టేట్‌మెంట్‌ తప్ప ఒక్క ప్రత్యక్ష సాక్ష్యం కూడా లేదని.. అన్నీ వినికిడి (హియర్‌ సే) సాక్ష్యాలేనని పేర్కొన్నారు. భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డిపై సీబీఐ ఒకేరకమైన ఆరోపణలు చేసిందని.. అవినాశ్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ ఇచ్చినప్పుడు.. అదే స్థితిలో ఉన్న భాస్కర్‌రెడ్డి జైల్లో ఉండడం సమంజసం కాదని తెలిపారు. అనారోగ్య సమస్యలున్న సీనియర్‌ సిటిజెన్‌ అయిన పిటిషనర్‌కు బెయిల్‌ ఇవ్వాలని.. ఇప్పటికే దాదాపు నెలన్నర రోజులకు పైగా జైల్లో ఉన్నారని చెప్పారు.

Updated Date - 2023-06-10T17:43:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising