ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu news: 14 రోజుల తర్వాత రాజమండ్రి జైలు నుంచి జడ్జితో మాట్లాడిన చంద్రబాబు.. ఏమన్నారంటే..

ABN, First Publish Date - 2023-09-22T11:48:38+05:30

స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో (skill case) అరెస్టయిన మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి రిమాండ్ శుక్రవారంతో ముగిసింది. దీంతో పోలీసులు వర్చువల్‌గా ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో రెండు రోజులపాటు చంద్రబాబు రిమాండ్ పొడగిస్తూ కోర్ట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న్యాయమూర్తి తన నిర్ణయాన్ని వెల్లడించారు.

విజయవాడ/రాజమండ్రి: స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో (skill case) అరెస్టయిన మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి రిమాండ్ శుక్రవారంతో ముగిసింది. దీంతో పోలీసులు వర్చువల్‌గా ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో రెండు రోజులపాటు చంద్రబాబు రిమాండ్ పొడగిస్తూ కోర్ట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న్యాయమూర్తి తన నిర్ణయాన్ని వెల్లడించారు.


ఇది నా బాధ, నా ఆవేదన, నా ఆక్రందన..

చంద్రబాబును వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన సందర్భంగా దాదాపు 14 రోజుల తర్వాత చంద్రబాబు తొలిసారి జడ్జితో మాట్లాడారు. 45 ఏళ్ల సుధీర్ఘ రాజకీయ జీవితం తనదని, నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సిందని అన్నారు. ‘‘ నేను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. అన్యాయంగా నన్ను అరెస్టు చేశారు. ఇది నా బాధ, నా ఆవేదన, నా ఆక్రందన. ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు. నామీద ఆరోపణలు మాత్రమే.. నిర్ధారణ కాలేదు. చట్టానికి అందరూ సమానమే... చట్టాన్ని నేను గౌరవిస్తా’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా జైలులో సౌకర్యాల గురించి జడ్జి అడిగి తెలుసుకున్నారు. జైలులో సౌకర్యాల విషయంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అని చంద్రబాబుని అడిగారు. సౌకర్యాలు అవసరమైతే దానికి అనుగుణంగా ఆదేశిస్తామని తెలిపారు.

మీరు దీన్ని శిక్షగా భావించొద్దు: చంద్రబాబుతో జడ్జి

చంద్రబాబు ఆవేదన విన్న తర్వాత జడ్జి స్పందించారు. ‘‘ మీరు పోలీసు కస్టడీలో లేరు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. దీన్ని మీరు శిక్షగా భావించొద్దు’’ అని చంద్రబాబుతో జడ్జి అన్నారు. వచ్చినవి ఆరోపణలు మాత్రమేనని, నిరూపణ జరగలేదన్నారు. చట్టం, నిబంధనల ప్రకారమే రిమాండ్‌ విధించామని, 24 వరకు జ్యుడిషియల్‌ కస్టడీలోనే ఉంటారని పేర్కొన్నారు. ‘‘ మిమ్మల్ని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరుతోంది. మీ తరఫు న్యాయవాదులు కస్టడీ అవసరం లేదని వాదించారు. చట్టం ముందు అందరూ సమానమే’’ అని ఈ సందర్భంగా న్యాయమూర్తి అన్నారు.

Updated Date - 2023-09-22T12:05:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising