ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ACB Court: చంద్రబాబు పిటిషన్ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు

ABN, First Publish Date - 2023-10-14T20:44:41+05:30

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు (Nara Chandrababu Naidu) మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ ఆయన లాయర్లు దాఖలు చేసిన హౌస్‌మోషన్ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) విచారణ చేపట్టింది.

విజయవాడ: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు (Nara Chandrababu Naidu) మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ ఆయన లాయర్లు దాఖలు చేసిన హౌస్‌మోషన్ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) విచారణ చేపట్టింది. రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని ఏసీపీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు అనారోగ్య రిత్యా ఏసీ కల్పించాలని చంద్రబాబు తరపున న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ చేశారు. ఆన్‌లైన్ ద్వారా విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. అత్యవసరంగా ఏసీ సౌకర్యం కల్పించాలని ఆదేశాలు ఇచ్చారు.


చంద్రబాబుకు వైద్యులు ఇచ్చిన నివేదికను పరిశీలించాలని కోర్టును న్యాయవాదులు కోరారు. ఆయనకు చల్లని వాతావరణ పరిస్థితులు కల్పించాలని పిటిషన్‌లో న్యాయవాదులు పేర్కొన్నారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలని కూడా ఏసీబీ కోర్టుకు చంద్రబాబు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-10-14T20:56:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising