Bhuvaneswari: తిరుపతి జిల్లాలో రెండో రోజు భువనేశ్వరి పర్యటన
ABN, First Publish Date - 2023-10-26T07:38:37+05:30
తిరుపతి జిల్లా: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన 'నిజం గెలవాలి' యాత్ర రెండో రోజు గురువారం తిరుపతితో కొనసాగనుంది. చంద్రబాబు అక్రమ అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు.
తిరుపతి జిల్లా: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababunaidu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) చేపట్టిన 'నిజం గెలవాలి' యాత్ర రెండో రోజు గురువారం తిరుపతి (Tirupati)లో కొనసాగనుంది. చంద్రబాబు అక్రమ అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. కాగా 27వతేదీ శుక్రవారం శ్రీకాళహస్తిలో భువనేశ్వరి పర్యటిస్తారు.
కాగా నిన్న (బుధవారం) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం అగరాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ‘నేను ఇక్కడకు వచ్చింది రాజకీయాలు మాట్లాడడానికి కాదు.. రాజకీయాలు చేయడానికీ కాదు. నిజం గెలవాలని చెప్పడానికే వచ్చాను. ఈ పోరాటం నా ఒక్కరిదే కాదు. మనందరిదీ.. మన రాష్ట్రం కోసం, మన భావితరాల కోసం ఈ పోరాటం’ అని భువనేశ్వరి స్పష్టం చేశారు. చేయి చేయి కలుపుదామని.. నిజాన్ని గెలిపిద్దామని పిలుపిచ్చారు.
‘చంద్రబాబు గురించి మాకన్నా మీకే బాగా తెలుసు. ఆయన నిరంతరం మీకోసమే ఆలోచిస్తారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 ఏళ్లలో సీఎంగా ఎంతో ముందు చూపుతో పనిచేశారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని 25 ఏళ్ల క్రితం హైటెక్ సిటీని తీసుకొచ్చి లక్షలాది కుటుంబాల్లో సంతోషం నింపారు. అప్పట్లోనే ఆయనకు అంత విజన్ ఉండేది. అందరూ నవ్వారు. రాళ్లూరప్పల మధ్య హైటెక్ సిటీ ఏమిటన్నారు? నేను కూడా అదే అన్నాను.. ఎందుకక్కడ హైటెక్ సిటీ అని అడిగాను. ఏడాది వేచిచూడమన్నారు. ఆ తర్వాత సైబరాబాద్ ఎలా ఉందో ఇప్పుడు మీరే చూస్తున్నారు. అది ఆయన కష్టార్జితం’ అని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ శ్రేణులను వేధించడం తప్ప రాష్ట్రాభివృద్ధి, యువతకు ఉపాధి మార్గాలు చూడాలన్న ధ్యాసే లేదని ధ్వజమెత్తారు. తనకు ఎదురైన పరిస్థితులు ఏ స్త్రీకీ రాకూడదని అన్నారు ‘నిజం గెలవాలి.. నిజమే గెలవాలి’.. సత్యమేవ జయతే’ అని భువనేశ్వరి నినదించారు. ప్రజల చేతా అనిపించారు.
Updated Date - 2023-10-26T07:38:37+05:30 IST