Tirupati: ప్రవీణ్‌రెడ్డి ఇంటికి నారా భువనేశ్వరి
ABN, First Publish Date - 2023-10-25T11:10:40+05:30
తిరుపతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం ఉదయం తిరుపతి జిల్లాలో నిజం గెలవాలి పేరుతో యాత్ర ప్రారంభించారు. ముందుగా నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
తిరుపతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం ఉదయం తిరుపతి జిల్లాలో నిజం గెలవాలి పేరుతో యాత్ర ప్రారంభించారు. ముందుగా నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రగిరి బజారువీధిలో.. ప్రవీణ్‌రెడ్డి ఇంటికి భువనేశ్వరి వెళ్లారు. ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. టీడీపీ సోషల్ మీడియాలో ప్రవీణ్‌రెడ్డి యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో అదే ఆలోచనతో ఈనెల 18వ తేదీన ఆవులపల్లి ప్రవీణ్ రెడ్డి మృతి చెందారు.
నారా భువనేశ్వరి తొలి విడత చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో మూడు రోజుల పర్యటన ఖరారైంది. ఈ మూడు రోజులూ ఉదయం నుంచీ మధ్యాహ్నం వరకూ వివిధ కారణాలతో మృతి చెందిన టీడీపీ నాయకుల, కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. మధ్యాహ్నం తర్వాత నుంచి మహిళలతో ముఖాముఖీ సమావేశాల్లో పాల్గొంటారు. తొలి రోజైన బుధవారం 25న చంద్రగిరిలో సమావేశంలో పాల్గొంటారు. 26న గురువారం తిరుపతిలో, 27న శుక్రవారం శ్రీకాళహస్తిలోనూ పర్యటిస్తారు.
Updated Date - 2023-10-25T11:10:40+05:30 IST