Chandrababu: తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు చంద్రబాబు ఆరా
ABN, First Publish Date - 2023-01-27T22:04:04+05:30
సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు (Chandrababu) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్: సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు (Chandrababu) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. కుప్పం ఆస్పత్రి వైద్యులతో ఫోన్లో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని చంద్రబాబు చెప్పారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్న బాలకృష్ణ, పార్టీ నేతలతో చంద్రబాబు మాట్లాడారు. ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), తారకరత్న భార్య కూడా బాలకృష్ణకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.
నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన సినీ నటుడు నందమూరి తారకరత్న (Taraka Ratna) సొమ్మసిల్లి పడిపోయారు. కుప్పం పట్టణం (Kuppam town) లక్ష్మీపురంలోని మసీదులో శుక్రవారం జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో లోకేశ్, నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), తారకరత్న పాల్గొన్నారు. మిగిలినవారి కంటే కాస్త ముందుగా తారకరత్న మసీదు నుంచి బయటికి వచ్చేశారు. మసీదు బయట కాస్త దూరంలో తారకరత్న ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోయారు. వెంటనే యువగళం బృందంలోని వలంటీర్లు ఆయన్ను కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్ మెడికల్ కాలేజీకు తరలించారు. నందమూరి బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Buchaiah Chaudhary) తదితర ప్రముఖులు పీఈఎస్కు వెళ్లి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు.
Updated Date - 2023-01-27T22:05:03+05:30 IST