Chittoor: మదపుటేనుగును అడవుల్లోకి మళ్లించే ఆపరేషన్
ABN, First Publish Date - 2023-08-31T08:33:00+05:30
చిత్తూరు: ఒంటరి మదపుటేనుగును అడవుల్లోకి మళ్లించే ఆపరేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. రామకుప్పం మండలం, నంద్యాల ఎలిఫెంట్ సెంటర్ నుంచి వినాయక, జయంతి రెండు ట్రైనీ కుంకి ఏనుగుల సహాయంతో అటవీ శాఖ అధికారులు ఆపరేషన్ మొదలు పెట్టారు.
చిత్తూరు: ఒంటరి మదపుటేనుగు (Madaputenugu)ను అడవుల్లోకి మళ్లించే ఆపరేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. రామకుప్పం మండలం, నంద్యాల ఎలిఫెంట్ సెంటర్ నుంచి వినాయక, జయంతి రెండు ట్రైనీ కుంకి ఏనుగుల (Elephants) సహాయంతో అటవీ శాఖ అధికారులు (Forest Department Officials) ఆపరేషన్ (Operation) మొదలు పెట్టారు. మదపుటేనుగు చాలా అగ్రెసివ్‌గా ఉంది. ఏనుగులను మళ్లించేందుకు అటవీ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతం నుంచి 12 కిలోమీటర్ల దూరం వరకు మదపుటేనుగును ట్రాకర్లు (Trackers) వెళ్లగొట్టారు. ఆపరేషన్ కార్యక్రమంలో ముగ్గురు ట్రాకర్లకు స్వల్పంగా గాయాలు అయ్యాయి.
కాగా గుడిపాల మండలం 190 రామాపురం గ్రామంలో భార్యాభర్తలు వెంకటేష్, సెల్విపై ఒంటరి మదపుటేనగు దాడి చేసి చంపేసింది. శ్రీరంగంపల్లి చెరువులో ఉన్న మదపుటేనుగును అడవుల్లోకి తరలించేందుకు కుంకీ ఏనుగుల సహాయంతో ఆపరేషన్ మొదలు పెట్టారు. రాత్రంతా అధికారులు ఆపరేషన్ నిర్వహించారు. గుడిపాల మండలం నుంచి చిత్తూరు రూరల్ మండలం పరిధిలోని నరసింగరాయిని పేట వరకు వెళ్లగొట్టారు.
Updated Date - 2023-08-31T08:33:00+05:30 IST