ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM Ramesh: బీటెక్ రవి అరెస్ట్ తీరుపై మా ద గ్గర అన్ని ఆధారాలున్నాయి.

ABN, First Publish Date - 2023-11-25T14:07:45+05:30

బీటెక్ రవి అరెస్ట్ తీరుపై మా ద గ్గర అన్ని ఆధారాలున్నాయని బీజేపీ నాయకుడు సీఎం రమేష్ పేర్కొన్నారు. నేడు ఆయన ఏబీఎన్‌తో మాట్లాడుతూ... పులివెందుల టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి అరెస్ట్‌పై తాను అవాస్తవాలు చెప్పానని కడప ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం దారుణమన్నారు. సీఐ అశోక్ రెడ్డి తన శక్తి సామర్ధ్యాలు ఉపయోగించి ఎస్పీ తో ప్రెస్‌మీట్ పెట్టించారని సీఎం రమేష్ ఆరోపించారు.

అమరావతి : బీటెక్ రవి అరెస్ట్ తీరుపై మా ద గ్గర అన్ని ఆధారాలున్నాయని బీజేపీ నాయకుడు సీఎం రమేష్ పేర్కొన్నారు. నేడు ఆయన ఏబీఎన్‌తో మాట్లాడుతూ... పులివెందుల టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి అరెస్ట్‌పై తాను అవాస్తవాలు చెప్పానని కడప ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం దారుణమన్నారు. సీఐ అశోక్ రెడ్డి తన శక్తి సామర్ధ్యాలు ఉపయోగించి ఎస్పీ తో ప్రెస్‌మీట్ పెట్టించారని సీఎం రమేష్ ఆరోపించారు. కడపలో సీఐ అశోక్ రెడ్డి.. ఐజీ రేంజ్ పవర్స్ చూపిస్తున్నాడని తాను గతంలోనే చెప్పానన్నారు. బీటెక్ రవి అరెస్ట్ తీరుపై మా దగ్గర అన్ని ఆధారాలూ ఉన్నాయన్నారు. ఆధారాలతో కేంద్రహోమ్ శాఖకు ఫిర్యాదు చేశానన్నారు. తనకు లీగల్ నోటీసిస్తే సరైన సమాధానం చెబుతానన్నారు. బీటెక్ రవి కడప జిల్లాలోనే ఉన్నాడని.. 10 నెలల నాటి ఓచిన్న కేసును నాన్ బెయిలబుల్‌గా మార్చి ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ‘కడప ఎస్పీ గారు.. మీరు యువ ఐపిఎస్ అధికారి.. మీకు మంచి భవిష్యత్ ఉంది. వివాదాలు వద్దు’ అని సీఎం రమేష్ సూచించారు.

Updated Date - 2023-11-25T14:07:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising